Cheque Book: చెక్కు రాసేటప్పుడు ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..! లేదంటే చిక్కులు తప్పవు..
Cheque Book: చాలామంది నగదు లావాదేవీల కోసం రకరకాల మార్గాలను ఉపయోగిస్తారు...
Cheque Book: చాలామంది నగదు లావాదేవీల కోసం రకరకాల మార్గాలను ఉపయోగిస్తారు. అందులో చెక్ బుక్ ద్వారా కూడా నగదు బదిలీ చేస్తారు. అయితే చాలామందికి ఇప్పటికీ చెక్ ఎలా రాయడమో తెలియదు. అందులోని విషయాలు కొంతమందికి అర్థం కావు. దీంతో వారు తప్పుగా నింపుతారు. తర్వాత సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే చెక్ నింపేటప్పుడు కింది జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
1. ముందుగా జారీ చేసిన అన్ని చెక్కుల వివరాలను భద్రంగా ఉంచాలి.
2. మీ చెక్‌బుక్‌ను సురక్షితమైన ప్రదేశంలో దాచాలి.
3. చెక్ బుక్‌పై ఉన్న చెక్ లీఫ్‌లను లెక్కించండి. ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే వెంటనే బ్యాంకు దృష్టికి తీసుకెళ్లండి.
చెక్ బుక్ ఎలా నింపాలి..
1. ఖాళీ చెక్కుపై ఎప్పుడూ సంతకం చేయవద్దు. ఎల్లప్పుడూ చెక్కుపై సంతకం చేయడానికి ముందు, మీరు ఎవరికి ఇస్తున్నారో వారి తేదీ, పేరుని కచ్చితంగా రాయాలి.
2. చెల్లింపుదారుడి పేరు, చెల్లించే అమౌంట్, తేదీ మొదలైనవి స్పష్టంగా ఉండాలి.
3. చెక్కును నింపేటప్పుడు ఎల్లప్పుడూ మీ సొంత పాన్ నెంబర్ ఉపయోగించండి. ఎప్పుడైనా సరే చెక్కుపై నింపేటప్పుడు ఖాళీ ఉంచవద్దు.
4. ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాలలో సైన్ ఇన్ చేయవద్దు.
5. మీరు చెక్కును రద్దు చేసినప్పుడు MICR బ్యాండ్‌ని చింపి, చెక్ పైన CANCEL అని రాయాలి.
6. ఏదైనా మార్పులు చేయవలసి వస్తే కొత్త చెక్కును జారీ చేయడం ఉత్తమం.
అక్టోబర్ 1 నుంచి మూడు బ్యాంకుల చెక్‌బుక్‌లు చెల్లడం లేదని అందరికి తెలిసిందే. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (OBC), అలహాబాద్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) ఉన్నాయి. OBC, UBI పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లో విలీనం అయ్యాయి.