Post Office: పోస్టాఫీసు సూపర్‌ స్కీం.. నెలకి 10 వేలతో 16 లక్షల ఫండ్‌..!

Post Office: మనీ ఇన్వెస్ట్‌ ద్వారా బాగా సంపాదించాలనే వ్యక్తులకి ఈ వార్త ఉపయోగకరంగా ఉంటుంది.

Update: 2023-03-24 12:42 GMT

Post Office: పోస్టాఫీసు సూపర్‌ స్కీం.. నెలకి 10 వేలతో 16 లక్షల ఫండ్‌..!

Post Office: మనీ ఇన్వెస్ట్‌ ద్వారా బాగా సంపాదించాలనే వ్యక్తులకి ఈ వార్త ఉపయోగకరంగా ఉంటుంది. పోస్టాఫీసులోని ఒక చిన్న స్కీం ద్వారా మీరు పెద్ద లాభాలని ఆర్ఙింజవచ్చు. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్‌ పేరు వినే ఉంటారు. ఇందులో పొదుపు చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. అంతేకాదు రుణం కూడా తీసుకోవచ్చు. కేవలం రూ.100తో పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఇందులో మీ డబ్బును 5 సంవత్సరాల పాటు ఆదా చేసుకోవచ్చు. ఏటా 5.8% వడ్డీ లభిస్తుంది. అలాగే ప్రతి మూడు నెలలకు చక్రవడ్డీని లెక్కిస్తారు.

5 సంవత్సరాలలో

PORD మెచ్యూరిటీ అంటే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అని అర్థం. అంటే మీ డబ్బు 5 సంవత్సరాల పాటు లాక్ చేస్తారు. తర్వాత వచ్చే అమౌంట్‌ని మరో 5 సంవత్సరాలకు పొడిగించవచ్చు. PORDలో నెలవారీ రూ.10,000 పెట్టుబడిని ప్రారంభిస్తే మెచ్యూరిటీపై దాదాపు రూ.16 లక్షలు పొందుతారు. రోజుకు కేవలం రూ.100తో పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. అలాగే ఇందులో పెట్టుబడికి పరిమితి లేదు.

ప్రతి నెలా రూ.10,000 డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత రూ.6,96,968 గ్యారెంటీ ఫండ్ ఏర్పడుతుంది. దీనిపై మీకు రూ.96,968 వడ్డీ లభిస్తుంది. ఈ మొత్తంలో పెట్టుబడి 6 లక్షల రూపాయలు మిగిలినవి వడ్డీ. దీన్ని మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే మీరు రూ.16,26,476 హామీతో కూడిన రాబడిని పొందుతారు. ఇందులో పెట్టుబడి రూ.12 లక్షలు వడ్డీగా మిగిలిన రూ.4,26,476 అవుతుంది. ఇలా ప్రతి నెలా 10 వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 10 ఏళ్లలో 16 లక్షల నిధిని సేకరించవచ్చు.

డిపాజిట్‌పై రుణ సౌకర్యం

మీరు డిపాజిట్‌పై రుణ సదుపాయాన్ని పొందవచ్చు. దీని కోసం కనీసం 12 వాయిదాలు డిపాజిట్ చేయాలి. దీనిపై సులభంగా 50% వరకు రుణాన్ని పొందవచ్చు. అంతేకాదు రుణాన్ని ఒకేసారి లేదా సులభమైన వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. అయితే ఆర్‌డిపై వచ్చే వడ్డీ కంటే దీనిపై వసూలు చేసే వడ్డీ ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News