Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ విషయంలో రూల్స్ మార్చిన ఇండియన్ రైల్వే.. అదేంటంటే?

Indian Railways: తరచూ రైలులో ప్రయాణించే వారు రైల్వే బోర్డు ఎప్పటికప్పుడు మార్చే నిబంధనల గురించి తప్పక తెలుసుకోవాలి. గతంలో ప్రయాణికులకు వర్తించే కొన్ని నిబంధనలను రైల్వే శాఖ మార్చింది. ఈ నియమాలలో ఒకటి రైలులోని స్లీపర్, AC కోచ్‌లో నిద్రించడానికి సంబంధించినది. అంటే ఇప్పుడు రైళ్లలో పడుకునే సమయాన్ని రైల్వేశాఖ మార్చేసింది.

Update: 2023-08-09 09:15 GMT

Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ విషయంలో రూల్స్ మార్చిన ఇండియన్ రైల్వే.. అదేంటంటే?

Indian Railway Rules: తరచూ రైలులో ప్రయాణించే వారు రైల్వే బోర్డు ఎప్పటికప్పుడు మార్చే నిబంధనల గురించి తప్పక తెలుసుకోవాలి. గతంలో ప్రయాణికులకు వర్తించే కొన్ని నిబంధనలను రైల్వే శాఖ మార్చింది. ఈ నియమాలలో ఒకటి రైలులోని స్లీపర్, AC కోచ్‌లో నిద్రించడానికి సంబంధించినది. అంటే ఇప్పుడు రైళ్లలో పడుకునే సమయాన్ని రైల్వేశాఖ మార్చేసింది. అంతకుముందు రైల్వే బోర్డు తరపున ప్రయాణీకుడు గరిష్టంగా తొమ్మిది గంటల పాటు నిద్రపోయే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఈ సమయాన్ని 8 గంటలకు తగ్గించారు.

గతంలో కంటే ఈ సమయం మారింది..

నిబంధన ప్రకారం, అంతకుముందు ప్రయాణికులు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఏసీ కోచ్, స్లీపర్‌లో నిద్రించవచ్చు. కానీ, రైల్వే వైపు నుంచి మారిన నిబంధనల ప్రకారం, ఇప్పుడు మీరు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే నిద్రించగలరు. అంతకంటే ఎక్కువ నిద్రిస్తే, రైల్వే మాన్యువల్ ప్రకారం జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. స్లీపింగ్ ఏర్పాట్లు ఉన్న రైళ్లలో మాత్రమే ఈ మార్పు వర్తిస్తుంది. ఈ మార్పును అమలు చేయడానికి కారణం ప్రయాణికులకు సరైన సౌకర్యాన్ని అందించడమే.

సమయం 9 గంటల నుంచి 8 గంటలకు తగ్గించిన రైల్వే శాఖ..

రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నిద్రించడానికి మంచి సమయంగా పరిగణిస్తుంటారు. అంతకుముందు కొందరు ప్రయాణికులు రాత్రి 9 గంటల నుంచి 6 గంటల వరకు రాత్రి భోజనం చేయడంతో మరికొందరు ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ప్రయాణీకులు రాత్రి 10 గంటల వరకు డిన్నర్‌ తదితరాలకు దూరంగా ఉంటారని, బెర్త్‌లపై పడుకుని హాయిగా ప్రయాణం చేయవచ్చని రైల్వేశాఖ భావిస్తోంది. మిడిల్ బెర్త్ ప్రయాణికులు త్వరగా నిద్రపోతారని లోయర్ బెర్త్‌లలోని ప్రయాణికులు చాలా కాలంగా ఫిర్యాదులు చేయడం కూడా వేళల్లో మార్పుకు మరో కారణం. దీంతో కింద సీటులో కూర్చున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇలాంటి ఫిర్యాదులు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న రైల్వేశాఖ నిద్ర సమయాన్ని మార్చింది. కొత్త రూల్ ప్రకారం, మిడిల్ బెర్త్ ప్యాసింజర్ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిద్రించవచ్చు. దీని తర్వాత బెర్త్‌ను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ సమయానికి ముందు లేదా తర్వాత ఎవరైనా ప్రయాణీకులు నిద్రపోతున్నట్లు కనిపిస్తే, మీరు దాని గురించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రయాణీకులపై చర్యలు తీసుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 2017లో రైల్వేశాఖ ఈ నిబంధనను అమలు చేసింది.

Tags:    

Similar News