Indian Railways: జనరల్ టిక్కెట్‌పై ఎన్ని రైళ్లలో ప్రయాణించవచ్చు? ఆసక్తికర విషయాలు మీకోసం..!
Indian Railways Rules: మీరు కూడా తరచుగా రైలులో ప్రయాణిస్తున్నట్లయితే, ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది.
Indian Railways Rules: మీరు కూడా తరచుగా రైలులో ప్రయాణిస్తున్నట్లయితే, ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. రైలులోని వ్యక్తుల బడ్జెట్‌ను బట్టి, AC, స్లీపర్, జనరల్ అంటే అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిలో, జనరల్ కోచ్‌లో ఛార్జీలు అత్యల్పంగా, ఏసీలో అత్యధికంగా ఉంటాయి. జనరల్ బోగీలో కూర్చోవడానికి ఎలాంటి టికెట్ రిజర్వ్ చేయాల్సిన అవసరం లేదు. టికెట్ విండో నుంచి టికెట్ తీసుకొని అందులో సులభంగా ప్రయాణించవచ్చు. సాధారణంగా తక్కువ దూరాలకు మాత్రమే సాధారణ టిక్కెట్టుపై ప్రయాణిస్తుంటారు.
ఈ నియమం మీకు బహుశా తెలియకపోవచ్చు..
ఇది మాత్రమే కాదు, చాలా సార్లు ప్రజలు ఒక టిక్కెట్‌పై రెండు లేదా అంతకంటే ఎక్కువ రైళ్లలో ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకుంటారు. అయితే రైలు జనరల్ కోచ్ నుంచి దిగిన తర్వాత ఎన్ని రైళ్లలో జనరల్ కోచ్‌లో ప్రయాణించవచ్చో తెలుసా. దీనికి కూడా ఒక నియమం ఉందని మీకు తెలియదు. తరచుగా రైలులో ప్రయాణించే వారికి కూడా ఈ విషయం తెలియదు. కానీ, అలా చేస్తే రైల్వే మాన్యువల్ ప్రకారం జరిమానా విధించవచ్చు.
ప్రయాణంలో చాలా మంది వ్యక్తులు ఏదైనా ఒక రైలులో ప్రయాణిస్తూ.. ఒక స్టేషన్‌లో ఆగి, అదే మార్గం గుండా వెళ్లే మరో రైలులో వెళ్తుంటారు. ఇలా చేయడం వెనుక చాలా కారణాలున్నాయి. దీనికి కారణం మొదటి రైలు ఆగిపోవడం, లేదా రద్దీ కారణంగా కావచ్చు. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం సాధారణ టికెట్‌పై ఒక రైలు నుంచి దిగి మరో రైలులో ప్రయాణించడం చెల్లదు.
తేడా కనిపిస్తే ఇబ్బంది పడవచ్చు..
టికెట్ తీసుకున్న రైలులోనే కూర్చొని ప్రయాణించడం చెల్లుబాటు అవుతుంది. టీటీఈ టికెట్ అడిగితే.. అందులో తేడా వస్తే ఇబ్బందులు తప్పవు. TTE మీకు జరిమానా కూడా విధించవచ్చు. వాస్తవానికి, మీరు టికెట్ కొనుగోలు చేసే స్టేషన్‌లో స్టేషన్ పేరు, సమయం ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఏ రైలుకు టికెట్ తీసుకున్నారో సులభంగా తెలిసిపోతుంది. మీరు వేరే రైలులో ప్రయాణిస్తే, దానిని సులభంగా గుర్తించవచ్చు.