Insurance Policy: రూ. 555తో రూ. 10 లక్షల బీమా.. పోస్టాఫీస్‌ నుంచి సూపర్ స్కీమ్‌..!

Insurance Policy: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పోస్టాఫీస్‌ ఎన్నో రకాల సేవింగ్స్‌ స్కీమ్స్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి రిటర్న్స్‌ వచ్చేలా ఈ పథకాలను అందిస్తోంది.

Update: 2024-07-08 12:30 GMT

Insurance Policy: రూ. 555తో రూ. 10 లక్షల బీమా.. పోస్టాఫీస్‌ నుంచి సూపర్ స్కీమ్‌..!

Insurance Policy: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పోస్టాఫీస్‌ ఎన్నో రకాల సేవింగ్స్‌ స్కీమ్స్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి రిటర్న్స్‌ వచ్చేలా ఈ పథకాలను అందిస్తోంది. అయితే కేవలం సేవింగ్‌ స్కీమ్స్‌ మాత్రమే కాకుండా కొత్త పాలసీలను సైతం ప్రవేశపెట్టింది. తాజాగా హెల్త్‌ప్లస్‌, ఎక్స్‌ప్రెస్‌ హెల్త్‌ ప్లస్‌ పేరుతో పాలసీలను తీసుకొచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ మొత్తం లభించేలా ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రమాదం కారణంగా మరణం, వైకల్యం లాంటి ఆర్థిక ప్రమాదాల నుంచి రక్షణ పొందొచ్చు. హెల్త్‌ ప్లస్‌లో మొత్తం 3 ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* హెల్త్‌ ప్లస్‌ ఆఫ్షన్స్ 1లో భాగంగా రూ. 5 లక్షల బీమా సదుపాయం లభిస్తుంది. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తికి మరణం లేదా శాశ్వత వ్యక్తిగత వైకల్యం సంభవిస్తే.. బీమా చేసిన వ్యక్తి కుటుంబం బీమా మొత్తంలో 100శాతం పొందుతుంది. అయితే కాలు లేదా చేయి విరిగితే రూ. 25,000 బీమా పొందొచ్చు. పిల్లల పెళ్లికి రూ. 50 వేల వరకు ఇన్సూరెన్స్‌ కవరేజీ లభిస్తుంది. ఈ పాలసీ ప్రీమియం పన్నులతో కలిసి రూ. 355గా నిర్ణయించారు.

* హెల్త్‌ ప్లస్ ఆప్షన్‌2లో భాగంగా రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ పొందొచ్చు. ఈ పథకంలో వార్షిక ప్రీమియం కింద పన్నుతో కలిపి రూ. 555 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి మరణం లేదా శాశ్వత వ్యక్తిగత వైకల్యం సంభవిస్తే, బీమా చేసిన వ్యక్తి కుటుంబం బీమా మొత్తంలో 100శాతం అందిస్తారు. కాళ్లు, చేతులు ఫ్రాక్చర్‌ అయితే రూ. 25,000 బీమా లభిస్తుంది. ఒకవేళ బీమా చేసిన వ్యక్తి కోమాలోకి వెళ్తే మూడు నెలల వరకు మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.

* హెల్త్‌ ప్లస్‌ ఆప్షన్‌ 3లో రూ. 15 లక్షల బీమా లభిస్తుంది. పాలసీ తీసుకున్న వ్యక్తికి మరణం లేదా శాశ్వత వ్యక్తిగత వైకల్యం సంభవిస్తే, బీమా చేసిన వ్యక్తి బీమా మొత్తంలో 100శాతం పొందొచ్చు. ఫ్రాక్చర్‌ అయితే రూ.25,000 బీమా లభిస్తుంది. పిల్లల పెళ్లిళ్లకు రూ.లక్ష వరకు కవరేజీ పొందొచ్చు. ఇక ప్రీమియం విషయానికొస్తే పన్నులతో కలిపి రూ. 755గా నిర్ణయించారు.

Tags:    

Similar News