Post Office Scheme: రోజుకి 95 రూపాయలు పొదుపు చేస్తే .. చివరలో 14 లక్షలు మీవే..!
Post Office Scheme: చిన్న, మధ్యతరగతి ప్రజల కోసం పోస్టాఫీసులో అనేక పొదుపు పథకాలు ఉన్నాయి.
Post Office Scheme: చిన్న, మధ్యతరగతి ప్రజల కోసం పోస్టాఫీసులో అనేక పొదుపు పథకాలు ఉన్నాయి. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడితో పాటు మీ డబ్బుకి భద్రత ఉంటుంది. పోస్టాఫీసులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాయి. వీటి ద్వారా మీరు మంచి ఫండ్‌ను సృష్టించవచ్చు. రోజుకు 95 రూపాయలలు ఆదా చేస్తే కొన్ని సంవత్సరాలలో మీరు 14 లక్షల రూపాయలను సంపాదిస్తారు. అలాంటి ఒక పథకం గురించి తెలుసుకుందాం.
గ్రామ సుమంగల్ గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ పథకం కింద ఒక వ్యక్తి ప్రతిరోజు రూ.95 వెచ్చించాల్సి ఉంటుంది. తర్వాత మీరు మెచ్యూరిటీపై రూ. 14 లక్షలు పొందుతారు. ఈ పథకంలో బీమా చేసిన వ్యక్తి మనుగడపై మనీ బ్యాక్ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేసిన మొత్తం డబ్బు తిరిగి వస్తుంది.
గ్రామ సుమంగల్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ప్లాన్‌లో బీమా చేసిన వ్యక్తి మెచ్యూరిటీపై బోనస్ కూడా పొందుతాడు. దీని కింద ఒక వ్యక్తి 15 మరియు 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పాలసీ తీసుకోవాలంటే పాలసీదారుడి వయస్సు 19 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. విశేషమేమిటంటే భారతదేశంలోని ప్రతి పౌరుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు ఇక్కడ పేర్కొన్న స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మీరు చేయాల్సిందల్లా రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం మాత్రమే. స్కీమ్ మెచ్యూరిటీ సమయంలో మీరు రూ. 14 లక్షలు పొందుతారు.