ఈ బ్యాంకు ఖాతాదారులకి ఎదురుదెబ్బ.. వడ్డీ విషయంలో నష్టమే..!
India Post Payments Bank: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు ఒక చేదువార్త ఉంది.
India Post Payments Bank: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు ఒక చేదువార్త ఉంది. మీకు ఇందులో పొదుపు ఖాతా ఉన్నట్లయితే పెద్దు ఎదురుదెబ్బ. పోస్ట్ ఆఫీస్ పరిధిలోకి వచ్చే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అన్ని పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను 25 bps తగ్గించింది. కొత్త రేట్లు జూన్ 1, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. ఇండియా పోస్ట్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. సేవింగ్స్ ఖాతాలపై సంవత్సరానికి 2 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇంతకుముందు వార్షిక వడ్డీ రేటు 2.25 శాతంగా ఉండేది. ఈ వడ్డీ రేటు రూ. 1 లక్ష వరకు ఉన్న పొదుపు ఖాతాలపై వర్తిస్తుంది. ఇండియా పోస్ట్ ప్రకారం రూ. 1 లక్ష కంటే ఎక్కువ, రూ. 2 లక్షల వరకు ఉన్న పొదుపు ఖాతాలపై ఇప్పుడు సంవత్సరానికి 2.25 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇంతకు ముందు ఏడాదికి 2.50 శాతం వడ్డీ లభించేది.
బీమా పథకాల ప్రీమియం పెరిగింది..
ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇతర పథకాల ప్రీమియంలను కూడా పెంచింది. ముఖ్యంగా, ప్రభుత్వం రెండు బీమా పథకాల ప్రీమియంను పెంచింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా (PMSBY) పథకాల ప్రీమియం పెరిగింది. PMJJBY ప్రీమియం రేటు రోజుకు రూ.1.25కి పెంచారు. అంటే ఇప్పుడు మీరు ఈ రెండు పథకాలకు 342కి బదులుగా రూ.456 చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి గతంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతికి ఏడాదికి రూ.330 చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు రూ.436కి పెరిగింది. గతంలో PMSBY వార్షిక ప్రీమియం రూ. 12 కాగా, ఇప్పుడు రూ. 20కి పెంచారు.