ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్‌ న్యూస్‌.. సేవింగ్‌ అకౌంట్లపై వడ్డీ రేట్ల తగ్గింపు..

India Post Payment Bank: సామాన్యులకు అందుబాటులో ఉండే ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు సేవింగ్‌ అకౌంట్లపై వడ్డీరేట్లు తగ్గించింది.

Update: 2022-02-01 14:30 GMT

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్‌ న్యూస్‌.. సేవింగ్‌ అకౌంట్లపై వడ్డీ రేట్ల తగ్గింపు..

India Post Payment Bank: సామాన్యులకు అందుబాటులో ఉండే ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు సేవింగ్‌ అకౌంట్లపై వడ్డీరేట్లు తగ్గించింది. ఖాతాదారులకు ఇది బ్యాడ్‌ న్యూస్ అనే చెప్పవచ్చు. సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 1 నుంచి లెక్కలోకి వస్తాయి. ఇంతకుముందు సేవింగ్స్ ఖాతాపై 2. 75శాతం వడ్డీ చెల్లించేది కానీ ఇప్పుడు దాన్ని .25 శాతం వరకు తగ్గించారు.

ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు ప్రకారం.. పొదుపు ఖాతాలో రూ.1 లక్ష బ్యాలెన్స్‌పై ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 2.50 శాతం. కానీ ఇప్పుడు అది 2.25 శాతానికి తగ్గింది. ఖాతాలోని రోజువారీ EOD బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీ లెక్కిస్తారు. ప్రతి త్రైమాసికంలో పొదుపు ఖాతాలో డబ్బు జమ చేస్తారు. IPPB తన వెబ్‌సైట్‌లో నోటీసు జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం వడ్డీ రేట్లు మార్చారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ కింద నడుస్తున్న విషయం తెలిసిందే.

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మూడు రకాల పొదుపు ఖాతాలను నిర్వహిస్తుంది. వీటిలో రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్, డిజిటల్ సేవింగ్స్ అకౌంట్, బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నాయి. రెగ్యులర్ సేవింగ్స్ ఖాతా ద్వారా అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. డబ్బును డిపాజిట్ చేయడం లేదా ఉపసంహరించుకోవడంతో పాటు ఈ ఖాతా నుంచి ఎన్నిసార్లయినా డబ్బు తీసుకోవచ్చు. డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని పొందాలనుకునే డిజిటల్ సేవింగ్స్ ఖాతాను అమలు చేస్తుంది. ఈ ఖాతాను IPPB మొబైల్ యాప్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మూడోది బేసిక్ సేవింగ్స్ ఖాతా. సాధారణ పొదుపు ఖాతా వలె దీంట్లో కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. 

Tags:    

Similar News