Gold Rate: దేశీయ మార్కెట్లో పెరిగిన బంగారం ధర

Gold Rate: స్వల్పంగా తగ్గిన మరో విలువైన లోహం వెండి కిలో రూ.69వేల 300

Update: 2021-04-06 05:24 GMT

గోల్డ్ (ఫైల్ ఫోటో)

Gold Rate: దేశీయ మార్కెట్లలో విలువైన లోహం పుత్తడి ధర పరుగులు పెడుతోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనల నడుమ లాక్‌డౌన్ భయాందోళనలు పెరిగిపోతున్న నేపధ్యంలో మదుపర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడులుగా పసిడి వైపు దృష్టి పెడ్తున్నారు. దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్‌లో ఎల్లో మెటల్ ధర గత పది రోజుల వ్యవధిలో 1100 రూపాయల మేర తగ్గగా... 1700 రూపాయల వరకు పెరిగింది. ఆదివారం రోజు నిలకడగా వున్న ఎల్లోమెటల్ గత రెండ్రోజులుగా దూకుడు కొనసాగిస్తోంది.

రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు 44వేల 410 రూపాయల వద్దకు చేరగా. ఆర్థిక రాజధాని ముంబైలో 44వేల200 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విశాఖల్లో 22 క్యారెట్ల ధర 42వేల 270గా నమోదు కాగా. 24 క్యారెట్ల ధర 46వేల110 రూపాయల వద్దకు చేరింది. మరోవైపు కేజీ వెండి ధర 69 వేల 300 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Tags:    

Similar News