UPI Payment: యూపీఐ చెల్లింపులలో మరో ముందడుగు.. ఆ సమస్య ఎదురైతే తక్షణ సాయం..!
UPI Payment: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది నేటి కాలంలో చాలామంది వినియోగించే చెల్లింపు పద్దతి.
UPI Payment: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది నేటి కాలంలో చాలామంది వినియోగించే చెల్లింపు పద్దతి. మీరు కొన్ని నిమిషాల్లో యూపీఐ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు చేయవచ్చు. కానీ చాలా సార్లు యూపీఐ చెల్లింపును ఆన్‌లైన్‌లో చేయడానికి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో సమస్యను అధిగమించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రియల్ టైమ్ పేమెంట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించింది.
అయితే రియల్ టైమ్ పేమెంట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ త్వరలో ప్రారంభంకానుంది. NPCI త్వరలో రియల్ టైమ్ చెల్లింపు వివాద పరిష్కార వ్యవస్థను ప్రారంభించనుంది. ఈ వ్యవస్థ సెప్టెంబర్ 2022 నాటికి ప్రారంభమవుతుంది. ఈ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన తర్వాత మీ చెల్లింపు సమస్యలు 90 శాతం వరకు తగ్గుతాయి. ఈ కొత్త సిస్టమ్‌ను రూపొందించిన తర్వాత మీరు మళ్లీ మళ్లీ బ్యాంక్‌కి కాల్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో పాటు అక్కడక్కడ శాఖ చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. మీరు మీ UPI యాప్‌లోని ఈ సిస్టమ్ ద్వారా నిమిషాల వ్యవధిలో సహాయాన్ని పొందుతారు.
ఈ పద్దతి ద్వారా యూపీఐలో ఇరుక్కున్న డబ్బు సమస్య దాదాపు 90 శాతం వరకు తగ్గుతుంది. గత కొన్నేళ్లుగా UPI వినియోగం చాలా వేగంగా పెరగడం గమనించదగ్గ విషయం. UPI ద్వారా మీరు నిజ సమయంలో ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరొక బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేయవచ్చు. ఈ రోజుల్లో ప్రజలు Google Pay, PhonePe, Bharat Pay, Paytm మొదలైన వివిధ యాప్‌ల ద్వారా సులభంగా UPI చెల్లింపును చేస్తున్న సంగతి తెలిసిందే.