Startup Ideas: స్టార్టప్‌ ప్రారంభించడానికి డబ్బులేదని చింతిస్తున్నారా.. ఇలా ప్రయత్నించండి..!

Startup Ideas: ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే అందులో డబ్బు ముఖ్యపాత్ర వహిస్తుంది.

Update: 2023-02-28 14:30 GMT

Startup Ideas: స్టార్టప్‌ ప్రారంభించడానికి డబ్బులేదని చింతిస్తున్నారా.. ఇలా ప్రయత్నించండి..!

Startup Ideas: ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే అందులో డబ్బు ముఖ్యపాత్ర వహిస్తుంది. అలాగే వ్యాపారాన్ని ఎంత ఎక్కువగా విస్తరించాలంటే అంత ఎక్కువగా డబ్బు అవసరమవుతుంది. మీరు స్టార్టప్ ప్రారంభించాలంటే దానికి డబ్బు చాలా కావాలని గుర్తుంచుకోండి. కొన్నిసార్లు ప్రజల తెలివైన స్టార్టప్ ఆలోచనలు నిధులు లేకపోవడం వల్ల నాశనం అవుతాయి. అలాంటి సమయంలో కొన్ని పద్దతుల ద్వారా డబ్బుని సమకూర్చుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

సొంత డబ్బుతో స్టార్టప్: సొంత డబ్బుతో స్టార్టప్‌ను ప్రారంభించడాన్ని బూట్‌స్ట్రాపింగ్ అంటారు. అంటే తల్లిదండ్రుల సాయం లేదా బంధువుల సాయం తీసుకోవచ్చు. స్టార్టప్ ప్రారంభించడానికి ఇది మంచి ఎంపికని చెప్పవచ్చు. ఈ సందర్భంలో ప్రయోజనాలు కొన్ని అప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్‌ చేయాలి. అప్పుడే వ్యాపారంలో విజయం సాధిస్తారు.

ఆస్తి తాకట్టు: ఆస్తిని తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చు. ఆభరణాలు మొదలైనవాటిని తాకట్టు పెట్టి కూడా రుణం తీసుకోవచ్చు. ఈ రకమైన రుణం సులభంగా లభిస్తుంది.

క్రెడిట్ లైన్: దీని ద్వారా స్టార్టప్ కోసం నిధులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు స్టార్టప్‌కు నిర్ణీత మొత్తాన్ని అందిస్తాయి. ఈ సందర్భంలో ఖర్చు చేసిన మొత్తంపై వడ్డీ వసూలు చేస్తారని గుర్తుంచుకోండి.

బ్యాంక్ ముద్రా పథకం: ఈ పథకంలో మూడు రకాల రుణాలు ఇస్తారు. ఇందులో మొదటిది శిశు రుణం. దీని కింద ఎవరైనా తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి రూ.50,000 వరకు రుణం తీసుకోవచ్చు.

కిషోర్ లోన్: కిషోర్ లోన్‌లో మీరు రూ.5 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. ఈ లోన్ ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి సూపర్ ఐడియా అని చెప్పవచ్చు.

తరుణ్ లోన్: తరుణ్ లోన్‌లో రూ.10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. వ్యాపారం పూర్తిగా నిలిచిపోయిన వారికి ఈ రుణం లభిస్తుంది. రుణంపై వార్షిక వడ్డీ రేటు దాదాపు 8 శాతం నుంచి ప్రారంభమవుతుంది. 7 సంవత్సరాల వరకు ఈ లోన్ పొందవచ్చు. తరుణ్ లోన్ తీసుకోవడానికి షరతు ఏంటంటే వ్యాపార లైసెన్స్, రిజిస్ట్రేషన్, వ్యాపారం చిరునామా రుజువు, ఆధార్ కార్డ్, పాన్ మొదలైన పత్రాలు అవసరం. ఈ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ఏదైనా బ్యాంక్ సంప్రదించి ఈ లోన్ గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు.

Tags:    

Similar News