Credit Score: బ్యాడ్‌ క్రెడిట్‌ స్కోర్‌ని ఎలా సరిచేయాలి.. ఇలా చేస్తే అది సాధ్యమే..!

Credit Score: బ్యాడ్‌ క్రెడిట్‌ స్కోర్‌ని ఎలా సరిచేయాలి.. ఇలా చేస్తే అది సాధ్యమే..!

Update: 2022-10-01 11:30 GMT

Credit Score: బ్యాడ్‌ క్రెడిట్‌ స్కోర్‌ని ఎలా సరిచేయాలి.. ఇలా చేస్తే అది సాధ్యమే..!

Credit Score: మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తూ క్రెడిట్‌ స్కోరు గురించి తెలియకుంటే ఈ వార్త మీకోసమే. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు బ్యాంక్ త్వరగా రుణాలు ఇవ్వదు. ఒకవేళ ఆ వ్యక్తికి బ్యాంకు రుణం ఇచ్చినప్పటికీ దానికి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. సాధారణంగా 750 అంతకంటే ఎక్కువ స్కోరు మంచి క్రెడిట్‌ స్కోరుగా చెబుతారు. క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు మంచి క్రెడిట్ స్కోర్ కోసం బిల్లులను చెల్లించడంలో నిర్లక్ష్యం చేయకూడదు.

ఒక బ్యాంక్ లేదా కంపెనీ ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్‌ను లెక్కించినప్పుడల్లా EMI ఎలా చెల్లించారో చెక్ చేస్తుంది. అందుకే క్రెడిట్ కార్డ్ బిల్లులు లేదా EMIలు సకాలంలో చెల్లించాలి. దీని కోసం మీరు ప్రతి బిల్లు తేదీకి రిమైండర్‌ని సెట్ చేయాలి. బిల్లు తేదీని అస్సలు మరచిపోకూడదు. క్రెడిట్ కార్డ్‌పై మినిమమ్‌ బ్యాలెన్స్‌ చెల్లించే బదులు బకాయి ఉన్న మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తే బాగుంటుంది. అయితే చాలామంది మినిమమ్‌ చెల్లిస్తే చాలనుకుంటారు. కానీ అది మీ క్రెడిట్ స్కోర్‌ను పాడు చేస్తుంది.

అలాగే చాలా సార్లు క్రెడిట్ కార్డ్ కంపెనీలు బకాయి ఉన్న మొత్తంపై అదనపు ఛార్జీలను వసూలు చేస్తాయి. మీరు ఎవరితోనైనా షేరింగ్‌ లోన్ తీసుకున్నప్పుడు మీ భాగస్వామి EMI చెల్లించడం మర్చిపోయినట్లయితే తప్పనిసరిగా లోన్ సమాచారాన్ని అందించాలి. లేదంటే మీ క్రెడిట్ స్కోర్‌పై చెడు ప్రభావం పడుతుంది. అందువల్ల భాగస్వామ్యంతో రుణం తీసుకుంటున్నప్పుడు EMIని ఎలా, ఎవరు చెల్లిస్తారో నిర్ధారించుకోవాలి.

క్రెడిట్ రిపోర్ట్‌లోని 'డేస్ పోస్ట్ డ్యూ' విభాగంలో చాలా సార్లు మిస్ అయిన చెల్లింపు మొత్తం కనిపిస్తుంది. కాబట్టి మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్డులపై DPDలను కలిగి ఉన్నట్లయితే వెంటనే బకాయి ఉన్న మొత్తాన్ని చెల్లించాలి. లేదంటే కంపెనీ మీకు వన్-టైమ్ సెటిల్‌మెంట్‌ను అందిస్తుంది. ఇందులో బకాయి మొత్తంలో కొంత భాగాన్ని చెల్లించాలి. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఈ రకమైన సెటిల్మెంట్ ఎంపికను ఎంచుకుంటారు. దీనివల్ల మీరు మొత్తం బకాయి చెల్లించలేరని అంగీకరిస్తున్నట్లు అర్థం. ఈ సమాచారాన్ని కంపెనీ క్రెడిట్ బ్యూరోలకు అందజేస్తుంది. దీనివల్ల క్రెడిట్‌ స్కోరుకి దెబ్బపడుతుంది.

Tags:    

Similar News