Gas Agency: గ్యాస్ ఎజెన్సీ డీలర్‌షిప్ ఎలా పొందాలి.. లాభాలు ఎలా ఉంటాయి..?
Gas Agency: గ్యాస్ ఎజెన్సీ డీలర్‌షిప్ ఎలా పొందాలి.. లాభాలు ఎలా ఉంటాయి..?
Gas Agency Dealership: మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే గ్యాస్ ఎజెన్సీ డీలర్‌షిప్ బిజినెస్ గురించి తెలుసుకోండి. దీనివల్ల మంచి లాభాలు సంపాదించవచ్చు. డీలర్‌షిప్ పెట్రో గ్యాస్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ లైసెన్స్‌లని జారీ చేస్తుంది. అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి డీలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పెట్రో గ్యాస్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ కంపెనీకి భారతదేశంలో పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయి. ఎల్‌పిజి డీలర్‌షిప్‌ల కోసం లైసెన్స్‌లని మంజూరుచేస్తుంది. ప్రతి ఇంటికి తన పరిధిని విస్తరించడానికి కంపెనీ డీలర్‌షిప్‌లను అందిస్తోంది.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..?
దరఖాస్తుదారు భారతదేశ నివాసి అయి ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇది కాకుండా వయస్సు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబ సభ్యులు ఎవరూ చమురు కంపెనీలో ఉద్యోగం చేయకూడదు. ఈ వ్యాపారం కోసం మీకు పెద్ద స్థలం ఉండాలి. ఎందుకంటే ఇది చిన్న స్థలంలో చేసే వ్యాపారం కాదు. ఇది కాకుండా సరైన పత్రాలు అవసరమవుతాయి. ఏజెన్సీని నిర్వహించడానికి కనీసం 10 మంది సహాయకులు అవసరమవుతారు. అంతేకాకుండా ఒక గోడౌన్ కూడా నిర్మించాల్సి ఉంటుంది.
మీకు సొంత భూమి ఉంటే గ్యాస్ ఏజెన్సీ డీల్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. సుమారు 5 నుంచి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. మీరు Petrogas అధికారిక వెబ్‌సైట్ https://petrogas.co.in/ సందర్శించడం ద్వారా డీలర్‌షిప్‌కి అప్లై చేయవచ్చు.హోమ్ పేజీలో డీలర్‌షిప్ ఎంపిక కనిపిస్తుంది. ఒక ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఇందులో అన్ని వివరాలను నింపి సమర్పించాలి. ఆ తర్వాత కంపెనీ మిమ్మల్ని సంప్రదిస్తుంది. ఈ డీలర్‌షిప్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో సిలిండర్‌కు మంచి లాభం పొందవచ్చు. చాలా మంది వ్యాపారులు గ్యాస్ సిలిండర్ల డీలర్‌షిప్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. ఇందులో లాభాల మార్జిన్ బాగానే ఉంటుంది.