Ration Card: వివాహం జరిగితే రేషన్‌కార్డులో మార్పు.. లేదంటే నష్టపోతారు..!
Ration Card: మీకు రేషన్ కార్డ్ ఉండి ఇటీవల వివాహం అయినట్లయితే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది.
Ration Card: మీకు రేషన్ కార్డ్ ఉండి ఇటీవల వివాహం అయినట్లయితే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది. పురుషులు వివాహం చేసుకున్నప్పుడు లేదా పిల్లలు జన్మించినప్పుడు రేషన్ కార్డు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అందులో కొత్త వ్యక్తుల పేర్లని యాడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇంటికి సరిపోయే రేషన్ అందదు. అంతేకాదు ప్రభుత్వ పథకాల విషయంలో కూడా నష్టం జరుగుతుంది. రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లని చేర్చే పూర్తి ప్రక్రియ గురించి తెలుసుకుందాం.
మీరు వివాహం చేసుకున్నట్లయితే ముందుగా మీ భార్య ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అందులో తండ్రికి బదులు భర్త పేరు మార్చాల్సి ఉంటుంది. అలాగే ఒక బిడ్డ జన్మించినట్లయితే అతని పేరును రేషన్‌కార్డులో యాడ్ చేయడానికి తండ్రి పేరు అవసరమవుతుంది. దీంతో పాటు చిరునామా తదితర సమాచారాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌ను అప్‌డేట్ తర్వాత సవరించిన ఆధార్ కార్డు కాపీతో పాటు, రేషన్ కార్డులోపేరును యాడ్ చేయడానికి ఆహార శాఖ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లో పేరు యాడ్ చేయడం
1. ముందుగా మీరు రాష్ట్ర ఆహార సరఫరా విభాగం అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
2. అందులో ఆన్‌లైన్‌లో సభ్యుల పేర్లను యాడ్ చేసే సౌకర్యం ఉంటే ఇంట్లో కూర్చొని ఈ పనిని చేయవచ్చు.
3. ఈ సదుపాయాన్ని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పోర్టల్ అందించాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఈ సదుపాయం లేదు.
పిల్లలకు అవసరమైన పత్రాలు
రేషన్ కార్డులో పిల్లల పేరును యాడ్ చేయాలంటే ముందుగా వారికి ఆధార్ కార్డును తయారు చేయాలి. అంతేకాదు పిల్లల జనన ధృవీకరణ పత్రం కూడా అవసరమవుతుంది. ఈ రెండు ఉంటే రేషన్ కార్డులో పేర నమోదు చేయడానికి అప్లై చేసుకోవచ్చు.