DA hike: డీఏ పెంపు ఎప్పుడు..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ..ఈ సారి ఎంత పెరుగుతుందంటే?

DA hike central government employees : డీఏ పెంపు ప్రకటనపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈవిషయంపై ప్రభుత్వం ఎప్పుడు ప్రకటన చేస్తుంది..ఈ సారి డీఏ ఎంత పెంచుతారనే ఆందోళన నెలకొంది.

Update: 2024-09-30 06:45 GMT

DA hike: డీఏ పెంపు ఎప్పుడు..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ..ఈ సారి ఎంత పెరుగుతుందంటే?

DA hike central government employees : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతోంది అయితే డిఏ (డియర్నెస్ అలవెన్స్) పెంపుపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఉద్యోగుల్లో మాత్రం కొంత ఆందోళన నెలకొని ఉంది కాగా డిఏ (డియర్నెస్ అలవెన్స్) పెంపుపై అక్టోబర్ నెలలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పలు వార్తా మీడియా కథనాలు తెలుపుతున్నాయి.

ముఖ్యంగా డిఎ పెంపు సాధారణంగా దీపావళి లో ఉంటుంది. అయితే అక్టోబర్ నెలలో దీపావళి పండగ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మూడు నుంచి నాలుగు శాతం డిఏ పెంపు చేసే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. గత సంవత్సరం 2023లో అక్టోబర్ నెల మొదటి వారంలో డీఏ పెంపు ప్రకటించారు. నిజానికి సెప్టెంబర్ నెలలో డిఏ హైక్ జరుగుతుందని అంతా భావించారు కానీ ఇప్పటికీ ఇంకా జరగలేదు.

నిజానికి ఏడాదికి రెండుసార్లు డిఏ పెంపు అనేది ఉంటుంది జనవరిలో సంబంధించిన డిఎ (డియర్నెస్ అలవెన్స్) హోలీ సమయం అంటే మార్చ్ లో ఉంటుంది ఇక జూలై నెలకు సంబంధించిన డి ఏ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఉంటుంది. ఈ డి ఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు రెండుసార్లు ఉపశమనం లభిస్తుంది. నిజానికి డిఏ అనేది పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం, ద్రవ్యోల్బణం ప్రభావం ఉద్యోగులపై పెన్షనర్లపై పడకుండా ఆ నష్టాన్ని సరిదిద్దడానికి ఆరు నెలలకు ఒకసారి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఆధారంగా డిఏ పెంపుదల అనేది ఉంటుంది.

ఉదాహరణకు నెల వేతనం 30 వేలు ఉన్నవారికి బేసిక్ శాలరీ 18000 ఉంటుంది అందులో 50% అంటే 9000 రూపాయలు లెక్క తీస్తారు దీనిపైన డిఏ పెంపు మూడు శాతం ఉంటే 540 రూపాయలు లభిస్తుంది. అంటే 9540 రూపాయలు అదనంగా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం దీపావళి నాటికి ఈ పెంపుదల అనేది క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు..

Tags:    

Similar News