Voter ID With Aadhaar: ఆధార్‌కార్డుతో ఓటర్‌ఐడీని లింక్ చేశారా.. ?
Voter ID With Aadhaar: ఆగస్ట్ 1న ఓటర్ ఐడి, ఆధార్ లింక్ చేసే డ్రైవ్‌ను ఎన్నికల సంఘం ప్రారంభించింది.
Voter ID With Aadhaar: ఆగస్ట్ 1న ఓటర్ ఐడి, ఆధార్ లింక్ చేసే డ్రైవ్‌ను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఇప్పటివరకు 54.32 కోట్ల ఆధార్ నంబర్లను సేకరించారు. ఎన్నికల (సవరణ) చట్టం, 2021ని పార్లమెంటు ఆమోదించిన తర్వాత ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. అందులో ఓటర్ ఐడీతో లింక్ చేయడానికి ఆధార్ నంబర్‌ను సేకరించే హక్కును పొందింది.
ఏప్రిల్ 1, 2023లోపు ఫారం 6-బి నింపడం ద్వారా ఓటర్లు ఓటర్ ఐడితో లింక్ చేయడానికి "ఆధార్"ని సమర్పించవచ్చని న్యాయ మంత్రిత్వ శాఖ జూన్ 17న నోటిఫికేషన్ జారీ చేసింది. గత వారం మొత్తం 95 కోట్ల మంది ఓటర్లలో దాదాపు సగం మంది వారి ఇష్టానుసారం ఓటర్ ఐడీతో ఆధార్‌ను అనుసంధానించారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఆధార్, ఓటర్ ఐడిని లింక్ చేయకుంటే జాబితా నుంచి ఏ ఓటరును తొలగించరని న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు స్పష్టం చేశారు.
యూఐడీఏఐ నిర్దేశించిన మార్గదర్శకాలను ఈసీఐ (ECI) ఖచ్చితంగా అనుసరిస్తుందని ఆధార్ నంబర్‌ను దాని డేటాబేస్‌లో నిల్వ చేయదని మంత్రి తెలిపారు. ఆధార్ నంబర్ ప్రమాణీకరణ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోస్తామని పేర్కొన్నారు. యూఐడీఏఐ ఆధార్ డేటాబేస్ నుంచి ఈసీఐ ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని పొందదు. ప్రతి ఒక్కరు ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కోరారు.