LIC Customers: ఎల్‌ఐసీ కస్టమర్లకు శుభవార్త.. ఆగిపోయిన పాలసీలు మళ్లీ పునరుద్దరణ

LIC Customers: దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్‌ కంపెనీ అయిన ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త చెప్పింది.

Update: 2022-02-06 12:30 GMT

LIC Customers: ఎల్‌ఐసీ కస్టమర్లకు శుభవార్త.. ఆగిపోయిన పాలసీలు మళ్లీ పునరుద్దరణ

LIC Customers: దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్‌ కంపెనీ అయిన ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న పాలసీలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. మెచ్యూరిటీ పూర్తికానీ పాలసీలు, లాప్స్‌ అయిన పాలసీలను క్రమబద్దీకరించడానికి అవకాశం కల్పించింది. పాలసీదారులు ఫిబ్రవరి 7, 2022 నుంచి మార్చి 25, 2022 వరకు పాలసీలను పునరుద్దరించుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ పునరుద్దరణలో భాగంగా కంపెనీ పాలసీని యాక్టివేట్ చేయడానికి చెల్లించే ఛార్జీలపై తగ్గింపు ప్రకటించింది. ల్యాప్స్‌ అయిన పాలసీని మళ్లీ యాక్టివేట్ చేస్తే చార్జీలో 20 నుంచి 30 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు ఎల్‌ఐసీ తెలిపింది. దీని కింద మీరు ఆలస్య రుసుము ఛార్జీల రూపంలో గరిష్టంగా రూ.3000 వరకు ఆదా చేసుకోవచ్చు. మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్‌లపై ఎటువంటి ఆలస్య రుసుము వసూలుచేయరు. అయితే టర్మ్ ప్లాన్‌లు, హై రిస్క్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లపై తగ్గింపులు ఉండవు.

కానీ పాలసీని మళ్లీ యాక్టివ్‌గా మార్చేందుకు మెడికల్‌ రిపోర్టులో ఎలాంటి రిలీఫ్‌ ఇవ్వడం లేదు. అయితే హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్‌లలో ఆలస్య ప్రీమియం చెల్లింపుపై విధించే ఛార్జీలు మాఫీ చేస్తారు. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాలసీలను కూడా యాక్టివేట్‌ చేసుకోవచ్చు. దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్‌ కంపెనీ అయిన ఎల్‌ఐసీ ఎంతో మందికి భరోసా కల్పిస్తోంది. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ కరోనా కాలంలో అందరికి ఎల్‌ఐసీ పాలసీ ఎంత ముఖ్యమో తెలిసివచ్చింది.

Tags:    

Similar News