Gold Rate Today: పెరిగిన బంగారం ధర..రెండు రోజుల్లో రూ. 1000జంప్..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: బంగారం నేడు భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఏకంగా రికార్డు స్థాయి ధరను నమోదు చేసింది. అయితే బంగారం ధరలు అక్టోబర్ 13 ఆదివారం ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను 78,170 రూపాయలు పలికింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,750 రూపాయలు పలికింది.

బంగారం గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ఒక్కసారిగా భారీగా పెరిగింది దీంతో సరికొత్త రికార్డును నమోదు చేసింది. బంగారం ధర భారీగా పెరగడంతో పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర ఏకంగా 600 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న కొన్ని ఉద్రిక్త పరిస్థితుల వల్లనే బంగారం ధర భారీగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు.
బంగారం ధర పెరగడానికి ప్రధానంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర ప్రస్తుతం ఉన్న ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి మరి కొంచెం పెరిగితే మాత్రం తొలిసారిగా 80 వేల రూపాయల మార్కును తాకే అవకాశం ఉంటుంది. బంగారం ధరలు ప్రస్తుతం ఇలా పెరగడం వల్ల ఆభరణాల మార్కెట్లో కొనుగోలు తగ్గే అవకాశం ఉంటుందని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బంగారం ధర ఈనెల ప్రారంభం నుంచి చూస్తే వరుసగా పెరుగుతూ వస్తోంది. ఇక ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గమనించినట్లయితే బంగారం ధర ఏకంగా 15000 రూపాయలు పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కూడా అమెరికాలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మదుపుదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు.
పసిడి ప్రియులు భవిష్యత్తులో మరింత ఆందోళన చెందే విషయాలు కనిపిస్తున్నాయి. ఈనెల చివరినాటికి బంగారం ధర ఇదే రేంజ్ లో పెరిగినట్లయితే 85 వేల రూపాయల వరకు చేరవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.