Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర..ఎంత పెరిగిందంటే?

Update: 2024-10-12 01:46 GMT

Gold Rate Today: పెరిగిన బంగారం ధర..రెండు రోజుల్లో రూ. 1000జంప్..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: నేడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అక్టోబర్ 12 శనివారం పసిడి ధరలు ఇలా ఉన్నాయి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 77,410 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,960 రూపాయలు పలికింది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయితో పోల్చి చూసినట్లయితే దాదాపు 800 రూపాయలు దిగువన ట్రేడ్ అవుతోంది.

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో పసిడి ప్రియుల్లో కాస్త ఆనందం కనిపిస్తోంది. అయితే బంగారం కొద్దికాలం పాటు రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధరలు ప్రస్తుతం ఉన్న రేంజ్ నుంచి మరికొంత తగ్గే అవకాశం ఉందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి బంగారం ముందుకు వెళ్లడానికి పాజిటివ్ సిగ్నల్స్ కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో బంగారం ధర స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. ఇలాంటి యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు అమెరికన్ స్టాక్ మార్కెట్లలో తమ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా డాలర్ బలం ఉంచుకోవడం ఎందుకు కారణంగా చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో బంగారం నుంచి కొద్దిగా లాభాలను విత్ డ్రా చేసుకునేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఈ రిలీఫ్ ఎంతకాలం ఉంటుంది అనేది చెప్పలేము అని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతోంది.

దీనికి తోడు దేశీయంగా చూసినట్లయితే ఈనెల చివరలో అక్షయ తృతీయ ఇలాంటి పండుగలు ఉన్నాయి. దీనికి తోడు దీపావళి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో పసిడి ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఆభరణాలు కొనుగోలు చేసేవారు బంగారం ధర తగ్గినప్పుడల్లా షాపింగ్ ప్లాన్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

Tags:    

Similar News