Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర..ఎంత తగ్గిందంటే?

Gold Rate Today: బంగారం ధర భారీగా తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 9, బుధవారం బంగారం ధర ఇలా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర..రూ. 77,440 నమోదవుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,990గా ఉంది. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూసినట్లయితే 10 గ్రాములపై సుమారు 200 రూపాయల వరకు తగ్గింది.

Update: 2024-10-09 01:40 GMT

బంగారం ధరలు ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో మంచి డిమాండ్ తో అమ్ముడవుతున్నాయి. అయితే బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైం రికార్డ్ స్థాయి కన్నా కూడా దాదాపు 300 రూపాయలు తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయం అని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం ధరలు పెరిగేకొద్దీ పసిడి ప్రియులకు షాక్ తగులుతోంది.

గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధర సరికొత్త రికార్డులను తాకింది. అయితే బంగారం ధర ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయి నుంచి కూడా పెరుగుదలను నమోదు చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకు ప్రధాన కారణం ఇంకా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

ఈ కారణంగా ప్రపంచ మార్కెట్లలో కరెక్షన్ కనిపిస్తోంది. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితంగా భావించే బంగారం వేగంగా తరలిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. పసిడి ధరలు వేగంగా పెరగడానికి ఇది ఒక కారణం. బంగారం ధరలు భవిష్యత్తులో కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని ఈ పరిస్థితులు సూచిస్తున్నాయి.

మరోవైపు అమెరికాలో కూడా బంగారం ధర ఒక ఔన్సు 2700 డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది. ఈ కారణంగా కూడా బంగారం ధరలు నూతన రికార్డులను సృష్టిస్తున్నాయి. బంగారం ధరలు గరిష్ట స్థాయి వద్ద ఉన్న నేపథ్యంలో ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నాణ్యత విషయంలోనూ తూకం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

Tags:    

Similar News