Gold Rate Today: పెరిగిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: నేడు సెప్టెంబర్ 29, ఆదివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేటి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,400గా పలికింది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,950గా పలుకుతోంది. పసిడి ధరలు మార్కెట్లో నిన్నటితో పోల్చి చూస్తే 200 రూపాయలు పెరిగాయి. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అమెరికా మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరగడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

Update: 2024-09-29 01:55 GMT

అమెరికాలో ఒక ఔన్సు బంగారం ధర 2700 డాలర్లుగా ఉంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మార్కెట్లు ఊగిసలాటకు గురవుతున్నాయి. దీంతో బంగారం ధరలు భారీగా పెరగడానికి ఊతం అందిస్తున్నాయి. పసిడి ధరలు పెరగడానికి మరోవైపు దేశీయంగా కూడా కారణాలు ఉన్నాయి. దసరా దీపావళి ధన త్రయోదశి సందర్భంగా మన దేశంలో బంగారం ఆభరణాల కొనుగోలు భారీగా జరుగుతాయి. ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో దేశీయంగా కూడా బంగారం ధరలు పెరిగేందుకు ఒక కారణం లభించింది.

ఇది ఇలా ఉంటే బంగారం ధర గత వారం రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చింది. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తోంది. ప్రస్తుతం బంగారం ధర 77 వేల రూపాయలు దాటింది. అయితే ఈ ధర భవిష్యత్తులో ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంది అనే అంచనాకు బులియన్ పండితులు సైతం రాలేకపోతున్నారు. బంగారం ధరలు పెరిగేందుకు ఒక రకంగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులే ప్రధానమైనవి నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు అమెరికా డాలర్ విలువ కూడా తగ్గిన నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఒకసారిగా పెరిగింది.

అలాగే ఈనెల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గించింది​. దీంతో బంగారం ధర పెరిగే అవకాశం ఉంటుందని ముందుగానే అంచనాలు వెలుపడ్డాయి. అందుకు తగ్గట్టుగానే బంగారం ధర పెరుగుతుంది​​. గత ఏడాది కాలంగా గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 17 వేల రూపాయలు పెరిగింది. పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో మీరు లాభాలను పొందాలని చూస్తున్నారా.

గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే కేవలం ఫిజికల్ బంగారం కొనుగోలు చేస్తే సరిపోదు. భారత ప్రభుత్వం విడుదల చేస్తున్న సావరిన్ గోల్డ్ బాండ్లపై పెట్టుబడి పెడితే పెరుగుతున్న బంగారం ధరలపై లాభాన్ని పొందవచ్చు. పైగా ఈ బాండ్లపై వడ్డీ కూడా లభిస్తుంది. బంగారం ధర పెరిగినప్పుడల్లా మీ బాండ్ విలువ కూడా పెరుగుతుంది.

Tags:    

Similar News