Gold Rate Today: ధన త్రయోదశి సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర
Gold Rate Today: ధన త్రయోదశి సందర్భంగా నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. అక్టోబర్ 29, మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు 80,880 రూపాయలు ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,950 రూపాయలు పలికింది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు 400 రూపాయలు తగ్గింది. బంగారం ధర గడచిన కొన్ని వారాలుగా ఆల్ టైం రికార్డ్ వద్ద ట్రేడ్ అవుతోంది.
బంగారం ధర తొలిసారిగా 81 వేల రూపాయలు దాటింది. అక్కడ నుంచి నేడు తగ్గుదల నమోదు చేసింది. నేడు ధన త్రయోదశి పర్వదినం ఈరోజు బంగారం కొనుగోలు చేసేందుకు చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఈరోజు కొద్ది మొత్తంలో నైనా బంగారం కొనేందుకు జనం ఆసక్తి చూపిస్తారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆభరణాల దుకాణాల్లో నేడు పెద్ద ఎత్తున రద్దీ ఉంటుంది.
పసిడి ప్రియులు ధన త్రయోదశి పండుగను చాలా సెంటిమెంట్ గా భావిస్తారు. ఉత్తర భారతీయులు ఈ పండుగను దంతేరస్ అంటారు. ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని భావిస్తారు. అలాగే సంవత్సరం అంతా శుభం జరుగుతుంది అని కూడా భావిస్తారు. ధన త్రయోదశి రోజున బంగారం కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే బంగారం ధరలో నెల రోజులుగా గమనించినట్లయితే, ఆల్ టైం రికార్డులను బద్దలు కొడుతూ బంగారం రాకెట్ కన్నా వేగంగా దూసుకెళ్లింది. ప్రస్తుతం బంగారం ధర 81 వేల రూపాయల సమీపంలో ఉంది. అయితే ఈ రేంజ్ నుంచి బంగారం ధర మరింత ముందుకు వెళుతుందా లేక పతనం అవుతుందా అనే సంగతి తెలియాల్సి ఉంది.
అంతర్జాతీయంగా గమనించినట్లయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలు బంగారాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీనికి తోడు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కూడా బంగారం పెరుగుదలకు ఒక కారణంగా మారింది.