Gold Rate Today: ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధర..తులం లక్ష దాటడం ఖాయం
Gold Rate Today: బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పసిడి ధర ఈరోజు సరికొత్త రికార్డును తాకింది. ముఖ్యంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,780 పలికింది. ఇంకా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,800 పలికింది.
Gold Rate Today: బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పసిడి ధర ఈరోజు సరికొత్త రికార్డును తాకింది. ముఖ్యంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,780 పలికింది. ఇంకా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,800 పలికింది.
బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అమెరికాలో పసిడి ధర భారీగా పెరగడం ఒక కారణంగా చెప్పవచ్చు. ఈరోజు అమెరికాలో ఒక ఔన్స్ (31 గ్రాములు) బంగారం ధర 2750 డాలర్లు పలికింది. దీంతో బంగారం ధర విపరీతంగా పెరిగింది. బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైం రికార్డ్ స్థాయి వద్ద ఉన్నాయి. దీనికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు కారణంగా చెప్పవచ్చు.
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ వాతావరణానికి తోడు, చైనా - తైవాన్ మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ప్రపంచ వాణిజ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి చాలా ఇబ్బందిగానే చెప్పాలి.
పసిడి ధరలు భారీగా పెరగడంతో ప్రస్తుతం రాబోయే ధన త్రయోదశి, దీపావళి సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసే వారికి చాలా ఇబ్బంది అని చెప్పాలి. బంగారం ధర ఎంత వేగంగా పెరిగిందో మనం చూడవచ్చు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మనం గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 12 వేల రూపాయలు పెరిగింది.
బంగారం ధర జూలై నెలలో 67 వేల రూపాయలు మాత్రమే ఉంది. కానీ ప్రస్తుతం 80000 దాటిపోయింది. దీన్ని బట్టి బంగారం ధర దాదాపు 13 వేల రూపాయలు ఈ మూడు నెలల్లోనే పెరిగింది. మీరు బంగారం కొనుగోలు చేస్తున్నట్లయితే కచ్చితంగా బరువు విషయంలోనూ నాణ్యత విషయంలోనూ ఎట్టి పరిస్థితులను కాంప్రమైజ్ కావద్దు.
ఒక మిల్లీగ్రామ్ తేడా వచ్చినా గాని మీరు పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెడితే మంచిది.