Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..వెండి ధరలు అదే దారిలో..

Gold Rate: వరుసగా రెండు రోజులు పైకెగసిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు కూడా కాస్త కిందికి దిగివచ్చాయి.. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

Update: 2020-10-24 01:37 GMT

రెండురోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా కిందికి దిగొచ్చాయి. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (24.10.2020) కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా కిందికి దిగివచ్చాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. శనివారం (24.10.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 47,100 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 110 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 51,380 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు కిందికి..

బంగారం ధరలు స్వల్ప తగ్గుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా ఈరోజు స్వల్ప తగ్గుదల కనబరిచాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరల కంటె తగ్గింది. ఈరోజు వెండి ధర కేజీకి 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 62వేల రూపాయల స్థాయికి వెండి ధరలు దిగివచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 62,600 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. శనివారం (24.10.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 47,100 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 110 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 51,380 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 110 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 49,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె భారీ స్థాయిలో కిందికి దిగివచ్చింది. ఒక్కసారిగా 1120 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దాంతో 53,000 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరల కంటె తగ్గింది. ఈరోజు వెండి ధర కేజీకి 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 62వేల రూపాయల స్థాయికి వెండి ధరలు దిగివచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 62,600 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 24-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News