Gold Rate Today: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధర..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నేడు 24 క్యారట్ల బంగారం 75,920 రూపాయలుగా ఉంది. 22 క్యారట్ల బంగారం ధర 69,590 రూపాయలుగా ఉంది.
Gold Rate Today: నేడు బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టించి ముందుకు వెళ్తున్నాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నేడు 24 క్యారట్ల బంగారం 75,960 రూపాయలుగా ఉంది. 22 క్యారట్ల బంగారం ధర 69,580 రూపాయలుగా ఉంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు కారణంగా చెబుతున్నారు.
ప్రధానంగా అమెరికా ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తూ ఉందని ఈ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారని, ఫలితంగా బంగారానికి డిమాండ్ పెరిగి ఆకాశమే హద్దుగా పెరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. బంగారం ధర ఇప్పటికే 76 వేల రూపాయల రేంజుకు చేరింది. దీంతో పసిడి ప్రియులు బంగారం కొనుగోలు చేయాలన్న నిరాశ చెందుతున్నారు.
ఇక దేశీయంగా చూస్తే కూడా అటు బంగారం ధరలు పెరిగడానికి వాతావరణం సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం దసరా నుంచి ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కానుంది. ఇది దాదాపు సంక్రాంతి వరకు కొనసాగే అవకాశం ఉంది.
మధ్యలో ధన త్రయోదశి, దీపావళి ఇలాంటి పండగలలో బంగారం ఆభరణాల కొనుగోలు విపరీతంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా బంగారం డిమాండ్ పెరిగి ధర పెరిగే అవకాశం ఉంటుంది.
పసిడి ధర భవిష్యత్తులో ఎంత పెరుగుతుంది అనే అంచనాలు కూడా ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. పరిస్థితి ఇలాగే మరో మూడు నెలలు కొనసాగితే బంగారం ధర అత్యంత సులభంగా 90 వేల నుంచి ఒక లక్ష రూపాయలు మధ్యలో చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు ఇలా భారీగా పెరగడం వెనుక దేశీయంగా ఉన్న డిమాండ్ కన్నా కూడా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే అసలు కారణమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలను అటు నియంత్రించడం ప్రభుత్వము వల్ల కూడా సాధ్యం కావడం లేదని, వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు బంగారం పై పెట్టుబడి పెట్టే వారికి గోల్డ్ బాండ్స్ సరైన ప్రత్యామ్నాయమని చెప్తున్నారు.