Gold Rate: బంగారం ధరలు మళ్ళీ పైకి.. భారీగా పెరిగి షాకిచ్చిన వెండి ధరలు!

Gold Rate: నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు షాకిచ్చాయి. భారీ స్థాయిలో పెరుగుదల కనబరిచాయి. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

Update: 2020-10-22 01:45 GMT

నిన్న తగ్గుదల బాటలో ఉన్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (22.10.2020) పైపైకి కదిలాయి. మరో వైపు గతవారంలో భారీగా తగ్గుతూ వచ్చిన వెండి ధరలు ఈరోజు పైకెగాశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (22.10.2020) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయలు పెరిగి 47,050 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 380 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 51,330 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు స్వల్ప పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా ఈరోజు భగ్గుమన్నాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ప్రారంభ ధరల కంటె పెరిగింది. ఈరోజు వెండి ధర కేజీకి 1500 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 63వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగశాయి. దీంతో కేజీ వెండి ధర 63,500 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. గురువారం (22.10.2020) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయలు పెరిగి 47,050 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 380 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 51,330 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు పై చూపులు చూశాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ప్రారంభ ధర కంటె 290 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,600 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బుధవారం నాటి ప్రారంభ ధర కంటె 310 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దాంతో 54,100 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ కేజీ వెండి ధర బుధవారం నాటి ప్రారంభ ధరల కంటె పెరిగింది. ఈరోజు వెండి ధర కేజీకి 1500 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 63వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగశాయి. దీంతో కేజీ వెండి ధర 63,500 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 22-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News