Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్..రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధర

Update: 2025-03-17 03:25 GMT
Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్..రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధర
  • whatsapp icon

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం..బలహీనపడుతున్న డాలర్ సహా పలు అంశాలు దేశంలో బంగారం ధరలు తగ్గేందుకు సహకరిస్తాయి. దీంతోపాటు బంగారం దిగుమతులై సుంకాల తగ్గింపు, బంగారం నిల్వల పెరుగుదల వంటి అంశాలు కూడా వీటి ధర తగ్గింపు విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా భారీగా పెరిగి సుమారు 90వేల స్థాయికి చేరిన బంగారం ధరలు ప్రస్తుతం స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలోనే నేటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మార్చి 17 సోమవారం న విజయవాడ, హైదరాబాద్ లో 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 89, 660 ఉండగా..ఈ ధర నిన్నటితో పోల్చితే స్వల్పంగా రూ. 10 మాత్రమే తగ్గింది. 22క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాములకు రూ. 82,190కి చేరింది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 89, 810 స్థాయికి చేరుకుంది. 22క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 82,340కి చేరుకుంది.

మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. దీంతో హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర నిన్నటితో పోల్చితే రూ. 100 తగ్గి రూ. 1,11,900స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1,02,900కు చేరుకుంది. పూణే, బెంగళూరు, జైపూర్ వంటి ప్రాంతాల్లో వెండి కిలో రూ. 1,02,900గా ఉంది. 

Tags:    

Similar News