Gold Rate:మరింత తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలు తగ్గుదల బాటలోనే!
Gold Rate: రెండోరోజూ బంగారం ధరలు ఈరోజుకొంత మేర తగ్గాయి. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.
వరుసగా రెండోరోజూ బంగారం ధరలు కాస్త శాంతించాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 04) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా కిందికి దిగివచ్చాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. శుక్రవారం (04.09.2020) బంగారం ధరలు గురువారం ధరలతో పోలిస్తే తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 390 రూపాయలు తగ్గి 48,770 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 430 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,200 రూపాయల వద్దకు చేరింది.
వెండి ధరలు పైపైకి..
బంగారం ధరలు తగ్గుదల చూపిస్తే, వెండి ధరలు కూడా అదేవిధంగా కొంతమేర తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు 200 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 65వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 65,600 రూపాయల వద్ద నమోదు అయింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 390 రూపాయలు తగ్గి 48,770 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 430 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,200 రూపాయల వద్దకు చేరింది.
దేశరాజధాని ఢిల్లీలో..
మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కాస్త కిందికి కదిలాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ధర కంటె 400 రూపాయలు తగ్గింది. దీంతో 49,600 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ధర కంటె 490 రూపాయలు తగ్గింది. దాంతో 54,110 రూపాయలకు దిగివచ్చింది. ఇక వెండి ధరలు.. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు 200 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 65వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 65,600 రూపాయల వద్ద నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 04-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.