Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త..భారీగా తగ్గిన బంగారం..తులం రేటు ఎంతుందంటే?

Gold Rate Today : బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోల్చి చూసినట్లయితే బంగారం ధర ఆదివారం స్వల్పంగా తగ్గింది. అయితే ఈ తగ్గుదల కేవలం 100 రూపాయల లోపు మాత్రమే ఉంది. నేటి తాజా ధరలు గమనిస్తే..24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 73,290 రూపాయలు పలుకుతుండగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 67,200 రూపాయలు పలుకుతోంది.

Update: 2024-09-08 03:08 GMT

Gold Rate Today: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధర..తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today : బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోల్చి చూసినట్లయితే బంగారం ధర ఆదివారం స్వల్పంగా తగ్గింది. అయితే ఈ తగ్గుదల కేవలం 100 రూపాయల లోపు మాత్రమే ఉంది. నేటి తాజా ధరలు గమనిస్తే..24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 73,290 రూపాయలు పలుకుతుండగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 67,200 రూపాయలు పలుకుతోంది.

బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాల కారణంగా వరుసగా పెరుగుతున్నాయి. త్వరలోనే బంగారం ధర 75 వేల రూపాయల వద్ద ఆల్ టైం రికార్డు స్థాయిని తాకే అవకాశం కనిపిస్తోంది. గతంలో బంగారం ధర 75 వేల రూపాయలను దాటింది. ఇప్పుడు ఆ లెవెల్ ను దాటినట్లయితే బంగారం సరికొత్త రికార్డు స్థాయిని నెలకొల్పుతుంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు పావు శాతం మీద తగ్గిస్తుందని వార్తలు, బంగారం సెంటిమెంటును పెంచుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బంగారం వైపు తమ పెట్టుబడులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఎందుకంటే అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లకు విలువ తగ్గుతుంది. అలాంటి సమయంలో తమ పెట్టుబడులను అమెరికా ట్రెజరీ బాండ్ల నుంచి తరలించి బంగారం వైపు పెడుతుంటారు. అమెరికా ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలో మార్కెట్ తీవ్రంగా హెచ్చుతగ్గులకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. దీని అంచనా వేసుకొని కూడా నిపుణులు బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు.

Gold Rate Today : బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోల్చి చూసినట్లయితే బంగారం ధర ఆదివారం స్వల్పంగా తగ్గింది. అయితే ఈ తగ్గుదల కేవలం 100 రూపాయల లోపు మాత్రమే ఉంది. నేటి తాజా ధరలు గమనిస్తే..24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 73,290 రూపాయలు పలుకుతుండగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 67,200 రూపాయలు పలుకుతోంది.తాజాగా బంగారం ధర అమెరికా మార్కెట్లో 2500 డాలర్లు దాటింది. అయితే ఈ లెవెల్ వద్ద దేశీయంగా గమనించినట్లయితే బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయి కన్నా తక్కువగానే నమోదు అవుతోంది. అయితే రానున్న ఫెస్టివల్ సీజన్ అంటే దసరా దీపావళి సందర్భంగా బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా బంగారం ధరలు దీపావళి నాటికి రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు.

Tags:    

Similar News