Gold Rate Today: తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతకు దిగొచ్చిందంటే?

Gold Rate Today:బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. వరుసగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి. దాదాపు 6 రోజుల తర్వాత ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ధరలు పడిపోవడం ఇందుకు కారణం. ప్రస్తుతం దేశీయంగా అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Update: 2024-08-15 01:51 GMT

Gold Rate Today: తగ్గిన బంగారం ధరలు ..తులం రేటు ఎంతకు దిగొచ్చిందంటే?

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ఎట్టకేలకు బంగారం ధరలు తగ్గాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న సంకేతాలన మధ్య బంగారం ధరలు వరుసగా పుంజుకున్నాయి. గత వారం రోజుల్లో ఒక్కసారి కూడా బంగారం ధరలు తగ్గలేదు. ఈ క్రమంలోనే బంగారం ధర భారీగా పెరిగిందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో, దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పడిపోయాయి. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే..డాలర్ , బాండ్ ఈల్డ్స్ గిరాకీ పడిపోయి బంగారం ధర పెరుగుతుంది. ఈ సంకేతాలతోనే ఈమధ్య బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో దేశీయంగాను కాస్త పడిపోయాయి.ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే బంగారం ధర ప్రస్తుతం ఔన్సుకు 2450 డాలర్ల దగ్గర ఉంది. అంతకుముందు ఒక దశలో 2470 డాలర్లపైకి చేరింది. ఇక స్పాట్ సిల్వర్ ధర 27.65 డాలర్ల దగ్గర కొనసాగింది. ఇదే సమయంలో డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ. 83.98 వద్దకు చేరింది.

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు దిగివచ్చాయి. ఢిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడిధర రూ. 100 పడిపోయింది. తులం రూ. 65,700 పలకుతుంది. అంతకుముందు రోజు రూ.950 పెరిగింది. నాలుగు రోజుల్లోనే రూ. 2150 వరకు పెరిగింది. ఇప్పుు తగ్గడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇదే సమయంలో 24క్యారెట్ల బంగారం ధర రూ. 110 పతనం అవ్వడంతో పది గ్రాములకు రూ. 71,660 ఉంది. బుధవారం ఏకంగా రూ. 1040 పెరిగింది. 

Tags:    

Similar News