Gold Loan: రుణాలన్నింటిలో గోల్డ్ లోన్ ఉత్తమం.. దీనివల్ల చాలా ప్రయోజనాలు..!
Gold Loan: రుణాలన్నింటిలో గోల్డ్ లోన్ ఉత్తమం.. దీనివల్ల చాలా ప్రయోజనాలు..!
Gold Loan: డబ్బు దగ్గరలేనప్పుడు అత్యవసర ఖర్చుల కోసం చాలామంది బ్యాంకు లోన్లపై ఆధారపడుతారు. ఇందులో వ్యక్తిగత లోన్లు ఎక్కువగా తీసుకుంటారు. కానీ వీటిపై బ్యాంకు అధిక వడ్డీని వసూలు చేస్తుంది. అందుకే ఇలాంటి సమయంలో గోల్డ్ లోన్ చాలా ఉత్తమమని చెప్పవచ్చు. ప్రతి ఇంట్లో ఎంతో కొంత బంగారం ఉంటుంది. దానిని తనఖా పెట్టడం వల్ల సులభంగా లోన్ లభిస్తుంది. పైగా పర్సనల్ లోన్ కంటే దీనిపై వడ్డీ తక్కువగా ఉంటుంది.
గోల్డ్‌కి విలువ ఎక్కువగా ఉంటుంది. అంటే బంగారం ధరలో 75% వరకు లోన్ పొందవచ్చు. అలాగే గోల్డ్ లోన్ వివిధ రకాల అవసరాలని తీర్చడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎలాంటి బలవంతం, షరతులు ఉండవు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి, రోజువారీ ఖర్చులను తీర్చడానికి, మూలధనాన్ని సేకరించడానికి గోల్డ్ లోన్ సరైన మార్గం. ఎందుకంటే ఇందులో వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. గ్రామీణ మహిళలు తమ ప్రణాళికలను కార్యరూపం దాల్చడానికి సొంత సంస్థను స్థాపించడానికి గోల్డ్ లోన్ ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
విద్యా రుణం
భారతదేశంలో, విదేశాలలో చదువుల కోసం విద్యా రుణాలను అందించే అనేక ఆర్థిక సంస్థలు ఉన్నాయి. అయితే ఇవి ఉన్నత స్థాయి సంస్థలకు మాత్రమే రుణాలు అందిస్తాయి. ఈ పరిస్థితిలో గోల్డ్ లోన్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఎటువంటి అర్హత ప్రమాణాలు ఉండవు. ఈ డబ్బును ఏ రకమైన కళాశాలలోనైనా అడ్మిషన్ కోసం ఉపయోగించవచ్చు.
వైద్య అత్యవసర కోసం
కష్టాలు చెప్పకుండా వస్తాయి. మెడికల్ ఎమర్జెన్సీ కూడా ఇందులో భాగమే. మందులు, చికిత్సలకి ఒక వ్యక్తి కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చవుతుంది. ఈ పరిస్థితిలో ఇంట్లో ఉంచిన బంగారం మీకు సహాయం చేస్తుంది. సులభమైన ప్రాసెసింగ్, త్వరగా డబ్బు చేతికి అందుతుంది.
ఇతర ఖర్చులను తీర్చడంలో
తక్కువ వడ్డీ రేట్లు, కోరిక మేరకు లోన్ మొత్తాన్ని చెల్లించే విధానం ఇందులో ఉంటుంది. ఇంటి మరమ్మతులకు అయ్యే ఖర్చు, ఫారిన్ టూర్ వంటి ఖర్చుల కోసం కూడా గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. అన్ని లోన్లతో పోల్చుకుంటే గోల్డ్‌లోన్ ఉత్తమమని చెప్పవచ్చు.