Gold Loan: మిగతా లోన్ల కంటే గోల్డ్ లోన్ ఉత్తమం.. ఈ ప్రయోజనాలు లభిస్తాయి..!
Gold Loan: ప్రజలు తమ ఆర్థిక అవసరాలని తీర్చుకోవడానికి తరచుగా రుణాలు చేయాల్సి ఉంటుంది.
Gold Loan: ప్రజలు తమ ఆర్థిక అవసరాలని తీర్చుకోవడానికి తరచుగా రుణాలు చేయాల్సి ఉంటుంది. వీటి కోసం మార్కెట్‌లో చాలా మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది బ్యాంకుని సంప్రదిస్తారు. ఏదో ఒక లోన్ ద్వారా డబ్బుని సేకరిస్తారు. అయితే దీనికి చాలా సమయం పడుతుంది. అంతేకాదు చాలా పేపర్‌వర్క్స్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ప్రజలు బ్యాంక్ అడిగే పత్రాలను కలిగి ఉండకపోవచ్చు. ఇటువంటి పరిస్థితిలో బంగారంపై రుణం తీసుకోవడం బెస్ట్.
గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీకు డబ్బు అవసరం అయితే బంగారాన్ని అమ్మకూడదనుకుంటే గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. ఇది సురక్షిత రుణ ఎంపిక. బంగారం విలువ ప్రకారం రుణం అందుతుంది. మీరు రుణం తీసుకున్నప్పుడు బంగారు ఆభరణాలను రుణదాతకు ఇవ్వాలి. పూర్తి మొత్తం తిరిగి చెల్లించిన తర్వాత మాత్రమే ఆభరణాలు తిరిగి ఇస్తారు.
తక్కువ వడ్డీ రేటు
అనేక బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లలో బంగారు రుణాలను అందిస్తున్నాయి. కాబట్టి తక్కువ వడ్డీ రేట్లకు రుణం పొందవచ్చు. మీరు వివిధ అవసరాలను తీర్చడానికి గోల్డ్ లోన్ పొందవచ్చు. రుణం కాలవ్యవధి 3 నెలల నుంచి గరిష్టంగా 48 నెలల వరకు ఉంటుంది. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్ స్టాల్ మెంట్స్ (EMI)లో రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. వడ్డీని ముందుగా చెల్లించవచ్చు. లోన్ కాలం ముగిసే సమయానికి ప్రధాన రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. రుణం తీసుకునే వ్యక్తి క్రమం తప్పకుండా వడ్డీని చెల్లిస్తే బంగారంపై వడ్డీ రేటు తగ్గిస్తారు.