మీరు బంగారాన్ని చౌకగా కొనుగోలు చేయాలంటే SBI ఆఫర్‌ని తెలుసుకోండి..
Sovereign Gold Bond: బంగారం కొనాలని చాలామందికి ఉంటుంది. కానీ పెరిగిన ధరల వల్ల దూరంగా ఉంటారు.
Sovereign Gold Bond: బంగారం కొనాలని చాలామందికి ఉంటుంది. కానీ పెరిగిన ధరల వల్ల దూరంగా ఉంటారు. ఇలాంటివారికి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. వీరు తక్కువ ధరలో బంగారం విక్రయించవచ్చు.సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఎనిమిదో సిరీస్ 2021-22 కింద నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఈ బాండ్‌లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పిస్తోంది. ఇందులో ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నప్పుడు SBI కస్టమర్లు ఈ-సర్వీసెస్ http://onlinesbi.com క్రింద ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చని ట్వీట్ చేసింది. ఈసారి ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు రూ.4,791గా నిర్ణయించింది. ఈ పథకం కింద మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే లేదా డిజిటల్ చెల్లింపు చేస్తే మీకు గ్రాముకు రూ.50 తగ్గింపు కూడా లభిస్తుంది.
ఎలా పెట్టుబడి పెట్టాలి
1. మొదటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నెట్ బ్యాంకింగ్ ఖాతాతో లాగిన్ అవ్వాలి.
2. ఈ-సేవలపై క్లిక్ చేయడం ద్వారా మీరు సావరిన్ గోల్డ్ బాండ్ ఎంపికకు వెళ్లాలి
3. మీరు అన్ని నిబంధనలు, షరతులకు అంగీకరిస్తున్నారు. కొనసాగడానికి క్లిక్ చేయండి
4. తర్వాత రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను నింపి సమర్పించాలి
పాన్ నంబర్ తప్పనిసరి
RBI సూచనల ప్రకారం దరఖాస్తుదారు పాన్ నంబర్ తప్పనిసరి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి అనేక ఎంపికలను అందిస్తుంది. బ్యాంకు శాఖలు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SHCIL) ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సిరీస్ VIII సబ్‌స్క్రిప్షన్ రేపటి (నవంబర్ 29) నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 3, 2021న ముగుస్తుంది. బాండ్ జారీ తేదీ 7 డిసెంబర్ 2021గా నిర్ణయించారు.