Gold and Silver Rates Today: మహిళలకు శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధర..వెండి అయితే

Update: 2024-12-07 01:16 GMT

Gold and Silver Rates Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అమెరికా డాలర్ బలపడటంతో పాటు పలు అంశాల నేపథ్యంల వీటి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే నేడు ఏ మేరకు తగ్గాయో..ఎంత తగ్గాయో చూద్దాం.

దేశంలో గత కొన్నాళ్లుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయని. ఈ క్రమంలో వీటి ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. శుక్రవారం పెరిగిన ధరలు శనివారం తగ్గాయి. ఈ నేపథ్యంలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 290 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర కూడా 200 పడిపోయింది. మరికొన్ని రోజుల్లో ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం బంగారం ధర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

నేడు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,610 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,140కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 77,760 ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 71,290 ఉంది. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల వివరాలు ఈ విధంగానే ఉన్నాయి.

Tags:    

Similar News