Gold and Silver Rates Today: స్థిరంగానే బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
Gold and Silver prices today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Gold and Silver prices today : దేశంతో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం, శనివారం భారీగా పెరిగిన బంగారం ధర ఆదివారం మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 66,950గా ఉంది. శనివారం కూడా ఇదే ధర ఉంది. ఇక 100 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ. 6,69,500గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 6,695గా కొసాగుతోంది.
మరోవైపు 24క్యారెటల పది గ్రాముల బంగారం ధర స్థిరంగా 73,040వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర ఉంది. అదే సమయంలో వంద గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 7,30,400గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 7,304గా కొనసాగుతోంది. దేశంలని కీలక ప్రాంతాల్లో కూడా బంగారం రేట్లు ఆదివారం స్థిరంగానే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,100గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 73,190గా కొనసాగుతోంది. ముంబై, కోల్ కతా, కేరళలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,950గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధరరూ. 73,040గా ఉంది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలోనూ ఈవిధంగా ఉన్నాయి.
అటు దేశంలో వెండి ధర కూడా ఆదివారం స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 8,800గా ఉంది. కేజీ వెండి ధర రూ. 88,000గా ఉంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 93,000పలుకుతోంది. కోల్ కతాలో 88,000, బెంగుళూరులో రూ. 84,500గా ఉంది.