Today Gold Rates: స్వల్పంగా పెరిగిన బంగారం ధర..నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Update: 2024-12-08 01:17 GMT

Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. తగ్గుతాయని భావించిన బంగారం ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు మరోసారి 78వేల స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం ధరలు మళ్లీ జోరందుకున్నాయి. నిన్న మొన్నటివరకు తగ్గుతూ పసిడి ప్రియులను మురిపించిన పసిడి ధరలు మళ్లీ పైపైకి చేరుతున్నాయి. మీరు బంగారం కొనుగోలు చేసే ముందుకు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. ఈ రోజు ఆదివారం బంగారం ధరలో స్వల్ప మార్పు కనిపించింది. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు కేవలం 10 రూపాయలు మాత్రమే పెరిగింది. దీంతో 77,620కి చేరింది. మరోవైపు వెండి ధర కూడా కిలోకు 100 రూపాయలు పెరిగింది.

హైదరాబాద్ , విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,620కి చేరుకుంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 71,150కి చేరుకుంది. ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 77, 770కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 71,300కు చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల గురించి చూద్దాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు)

ఢిల్లీలో రూ. 77, 770, రూ. 71,300

చెన్నైలో రూ. 77,620, రూ. 71,150

ముంబైలో రూ. 77,620, రూ. 71,150

వడోదరలో రూ. 77,670, రూ. 71,200

కేరళలో రూ. 77,620, రూ. 71,150

హైదరాబాద్‌లో రూ. 77,620, రూ. 71,150

విజయవాడలో రూ. 77,620, రూ. 71,150

బెంగళూరులో రూ. 77,620, రూ. 71,150

కోల్‌కతాలో రూ. 77,620, రూ. 71,150

పూణేలో రూ. 77,620, రూ. 71,150

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

ఢిల్లీలో రూ. 92,000

సూరత్‌లో రూ. 92,000

ముంబైలో రూ. 92,000

తిరుపతిలో రూ. 100000

హైదరాబాద్‌లో రూ. 100000

విజయవాడలో రూ. 100000

కేరళలో రూ. 100000

వడోదరలో రూ. 92,000

పాట్నాలో రూ. 92,000

అహ్మదాబాద్‌లో రూ. 92,000

చెన్నైలో రూ. 100000

కోల్‌కతాలో రూ. 92,000

Tags:    

Similar News