Gold Price Today: మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెరిగాయంటే?
Gold Price Today: గత మూడు నాలుగు నెలలుగా శుభాకార్యాలు లేవు. ఇప్పుడు శ్రావణమాసం ప్రారంభం అవ్వడంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు షురూ అయ్యాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లను అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం.
Gold Price Today: శ్రావణమాసం ప్రారంభం అవ్వడంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు మొదలయ్యాయి. దీంతో పెళ్లిళ్లు, ఫంక్షన్లు కూడా ప్రారంభం అవుతాయి. ఈ క్రమంలో బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బడ్జెట్ 2024 ప్రవేశపెట్టిన సందర్భంగాలో బంగారం ధరపై ట్యాక్స్ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన మరుక్షణమే అనూహ్యంగా రూ. 4వేలు తగ్గిన బంగారం ధరలు.. ఆ తర్వాత కొద్దికొద్దిగా పెరగడం మెదలు పెట్టాయి.
ప్రస్తుతం తులం ధర 70వేల మార్క్ దాటేసింది. కేంద్ర మంత్రి ప్రకటనతో బంగారం ధరలు మరింత తగ్గుతాయని ఆశించిన వారికి...పెరుగుతున్న ధరలు ఒకింత షాకిస్తున్నాయి. ఫ్యూచర్ లో మరింత తగ్గుతుందేమో కొనుగోలు చేయోచ్చు అనుకునేవారికి మాత్రం ఆందోళన కలిగించే విషయం. కాగా నేడు ఆగస్టు 14వ తేదీ దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ విజయవాడలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నా యో ఇప్పుడు చూద్దాం.
దేశంలో బంగారం ధరలు బుధవారం పెరిగాయి. 22 క్యారెట్లు పసిడి ధర 10 గ్రాముకు 10 రూపాయి మేర పెరిగి ఈ రోజు రూ. 65,660కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల బంగారం ధర రూ. 10లు పెరిగి రూ. 71,630లకు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాలలో ఆగష్టు 14 నాటికి బంగారం ధరలు..
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్లో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,660గా నమోదైంది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71,630గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశంలో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ. 65,810లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,780లు గా కొనసాగుతోంది.