Gold Rate Today: పెరిగిన బంగారం ధర..70వేల మార్క్ చేరిన పసిడి

Gold Rate Today: పెళ్లిళ్ల సీజన్ షురూ అయ్యింది. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. నిన్నటి వరకు తగ్గిన బంగారం, వెండి ధరలు శనివారం నుంచి పెరుగుదల మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మంచి రోజులు షురూ అవ్వడంతో బంగారం ధరలు మళ్లీ రెక్కలొస్తున్నాయి.

Update: 2024-08-10 02:06 GMT

Gold Rate Today: పెరిగిన బంగారం ధర..70వేల మార్క్ చేరిన పసిడి

Gold Rate Today: శ్రావణమాసం వచ్చేసింది. పెళ్లిళ్లు,శుభకార్యాలు షురూ అయ్యాయి. దీంతో బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. శనివారం నుంచి పెరుగుదల కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మంచి రోజులు ప్రారంభం అవ్వడంతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయంటున్నారు మార్కెట్ నిపుణులు.

హైదరాబాద్ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరూ 64,260గా ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోల్చితే రూ. 770 పెరిగింది. ఈ రోజు 64,260 పలుకుతోంది. స్వచ్చమైన బంగారం ధర రూ. 840 పెరిగింది. శుక్రవారం పది గ్రాముల బంగారం ధర రూ. 69, 260గా ఉంటే ఈ రోజు రూ. 70,100కి చేరుకుంది. విజయవాడలో కూడా ఇవే బంగారం ధరలు కొనసాగుతున్నాయి.

అటు దేశ రాజధానిలో ఢిల్లీలోనూ బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర రూ. 770 పెరిగింది. శుక్రవారం 63, 640గా ఉంటే ఈ రోజు 64, 410కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధరూ 840 పెరిగింది. శుక్రవారంతో పోల్చితే రూ. 69,410 ఉండగా ఈ రోజు 70,250కి చేరుకుంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 770 పెరిగింది. వెండిలో వెండి ధర హైదరాబాద్ లో రూ. 88,100కి చేరుకుంది.

Tags:    

Similar News