Today Gold price: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధర
Gold Rate Today: నేడు ఆగస్టు 29, గురువారం బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. నేడు హైదరాబాదు మార్కెట్లో బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.73,400 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,300 కొనసాగుతోంది. బంగారం ధరలు పెరుగుతున్నాయి.

దీంతో పసిడి ప్రియుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శ్రావణ మాసం కూడా మరో వారం రోజుల్లో ముగిసిపోతుంది. దీంతో పసిడి మార్కెట్లో కాస్త స్తబ్దత ఏర్పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ మాసంలో వివాహ ముహూర్తాలు తక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ ప్రారంభమవుతాయి. అయితే దసరా దీపావళి సందర్భంగా బంగారం ఆభరణాల కొనుగోలు మళ్ళీ జోరందుకుంటుంది.
బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వచ్చే పండగల సీజన్ లో పసిడి ధరలు ఆల్ టైం గరిష్ట స్థాయిని దాటే అవకాశం ఉందని పసిడి నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకు ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో జరిగే ఫెడరల్ రిజర్వ్ భేటీ కారణంగా వడ్డీరేట్లు పావు శాతం మీద తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి.
దీంతో బంగారం ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ బంగారం రేట్లను తగ్గించినప్పుడల్లా మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు కారణం ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గించినట్లయితే అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల పై వచ్చే రాబడి తగ్గిపోతుంది. దీంతో ఇన్వెస్టర్లు ట్రెజరీ బాండ్ల నుంచి తమ పెట్టుబడులను సురక్షితమైనటువంటి పెట్టుబడి సాధనమైన బంగారం వైపు తరలిస్తారు. బంగారం ధరలు పెరగడానికి ఇది ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
దీనికి తోడు అంతర్జాతీయంగా చైనా సెంట్రల్ బ్యాంకు ఎడాపెడా బంగారం నిల్వలను పెంచేసుకుంటోంది.దీంతో బంగారం ధరలు అమాంతం డిమాండ్ పెరగడంతో పెరుగుదల బాట పట్టాయి.