Gold Rate Today: పెరిగిన బంగారం ధర.. లక్ష దాటిన వెండి రేటు
Gold and Silver prices today : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. రెండు లోహాలు కూడా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈనేపథ్యంలో శనివారం మీ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం మరోసారి పెరిగాయి. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగింది. దీంతో రూ. 77,460కి చేరుకుంది. శుక్రవారం రోజు ఈ ధరరూ. 77,450గా ఉండేది. అదే సమయంలో 100గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి..రూ. 7,74,600గా ఉంది.
పది గ్రాముల బంగారం ధర కూడా రూ. 10 పెరిగి రూ. 71,010కి చేరుకుంది. శుక్రవారం ఈ ధర రూ. 71,100గా ఉంది. వందగ్రాముల బంగారం ధరరూ. 100 పెరిగి రూ. 7,10,100కి చేరుకుంది. గ్రాము బంగారం ధర ప్రస్తుతం రూ. 7,101వద్ద కొనసాగుతోంది.
ఇక దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,160గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,610 ఉంది. కోల్ కతాతోపాటు ముంబై, బెంగళూరు, కేరళలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,010గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,460గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో వెండి ధరలు కూడా శనివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం వంద గ్రాముల వెండి ధర రూ. 9,610గా ఉంది. కేజీ వెండి ధర రూ. వంద పెరిగి రూ. 96,100లకు చేరుకుంది. శుక్రవారం ఈ ధర రూ. 96,000గా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 1,02,100 పలుకుతుంది. వెండి ధరలు కోల్ కతాలో రూ. 96,100, బెంగళూరులో రూ. 89,900ఉంది.