Gold and Silver Prices Today: మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold and Silver Prices Today: దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో నేటి బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold and Silver Prices Today: దేశంలో శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 65,660కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 65,650గా ఉంది. 1 గ్రామ్ బంగారం ధర ప్రస్తుతం 6,566గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి..రూ. 71,630కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 71,620గా ఉండేది. అదే సమయంలో వంద గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి..రూ. 7,16,200గా ఉంది.
దేశంలోని కీలక ప్రాంతాల్లో కూడా బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారెట్ల బంగారం ధర రూ. 65,810గా ..24క్యారెట్ల బంగారం ధర రూ. 71,780గా ఉంది. కోల్ కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,660 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 71,630గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ లో ప్రస్తుతం 22క్యారెట్ల బంగారం ధర రూ. 65,660గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 71,630గా నమోదు అయ్యింది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేటు పెంపు వంటి అంశాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక దేశంలో వెండి ధరలు కూడా శనివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం వంద గ్రాముల వెండి ధర రూ. 8,410గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 84,100కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 84,000గా ఉంది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 89,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్ కతాలో రూ. 84,100..బెంగళూరులో రూ. 84,100గా ఉంది.