Gold News: బంగారం కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఒక నెల రోజులు ఓపిక పట్టండి.. భారీగా తగ్గే ఛాన్స్

Update: 2024-12-05 12:26 GMT

Gold News: బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. డిసెంబర్ నెలలో భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నెలలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకిన పసిడి ధర ఈ నెల మాత్రం ఆల్ టైమ్ గరిష్ట స్థాయి కన్నా కూడా 6వేలు తగ్గింది. అయితే భవిష్యత్తులో బంగారం ధర మరింత తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మీరు బంగారం కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లయితే ఒక నెల రోజులు ఓపిక పట్టండి. ఎందుకంటే బంగారం ధర భారీగా తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు.

బంగారం ధరలు డిసెంబర్ నెల ప్రారంభం నుంచి బంగారం తగ్గుతుంది. గత నెలలో ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకిన బంగారం ధర ఈనెల మాత్ర ఆల్ టైం గరిష్ట స్థాయి కంటే కూడా 6వేలు తగ్గింది. అయితే భవిష్యత్తులో బంగారం ధర మరింత తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకు గల కారణాలు మనం తెలుసుకుందాం.

బంగారం ధరలు ఫిబ్రవరి 1 నుంచి భారీగా తగ్గే ఛాన్స్ ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే బంగారం ధరలు డిసెంబర్ ప్రారంభం నుంచి తగ్గాయి. గత నెలలో ఆల్ టైం రికార్డ్ స్థాయిని బంగారం ధర ఈనెల మాత్రం 6 వేలు తగ్గింది.

ప్రస్తుతం పసిడి ధర 78 వేల రూపాయల సమీపంలో ట్రేడ్ అవుతోంది. అమెరికాలో చూస్తే ఒక ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 2600 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ లెక్కన చూస్తే బంగారం ధర అంతర్జాతీయంగా తగ్గే ఛాన్స్ అవుతుంది.

ముఖ్యంగా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా అమెరికా స్టాక్ మార్కెట్ విషయంలో అలాగే ఆర్ధిక వ్యవస్థను సరిదిద్దడానికి ఇకపై రక్షణాత్మక వైఖరిని అవలంభించే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్ల బలం పెంచుకునే ఛాన్స్ ఉంది.

డొనాల్డ్ ట్రంప్ సర్కార్ అమెరికాలో బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలను ప్రోత్సహిస్తుందని పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే బిట్ కాయిన్ లక్ష డాలర్లు దాటేసింది. ఫలితంగా పెట్టుబడి తమ పెట్టుబడులను బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల నుంచి బిట్ కాయిన్ వంటి క్రిప్టో ఆస్తుల వైపు తరలిస్తున్నారు. ఇది కూడా బంగారం ధర తగ్గేందుకు ఒక కారణమని చెప్పవచ్చు.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికా చేపట్టే ఈ విధానాల వల్ల భవిష్యత్తులో బంగారం ధర ప్రపంచ వ్యాప్తంగా తగ్గే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. మూడు నెలలుగా బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయి తాకింది. జులై నెలలో 67వేల రూపాయలు ఉన్న పసిడి ధర నవంబర్ నెల నాటికి ఏకంగా 84వేల రూపాయలకు చేరుకుంది. అంటే దాదాపు 4 నెలల వ్యవధిలో బంగారం ధర 17 వేల రూపాయలు పెరిగింది.

Tags:    

Similar News