Gold Rate: మహిళలకు షాకింగ్ న్యూస్..పెరిగిన బంగారం ధర

Gold Rate: మహిళలకు ఇది షాకింగ్ న్యూస్. దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. బుధవారం తగ్గిన బంగారం ధర నేడు పెరిగింది. హైదరాబాద్ లోపాటు దేశంలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

Update: 2024-08-21 23:48 GMT

Gold Rate Today: మహిళలకు అదిరిపోయే వార్త..భారీగా తగ్గిన బంగారం ధర

Gold Rate: దేశంలో బంగారం ధరలు పెరిగాయి. బుధవారం తగ్గిన బంగారం ధర..గురువారం పెరిగింది. గురువారం బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. క్రితం రోజు తగ్గిన బంగారం ధరలతో నేడు కూడా తగ్గుతాయన్నకున్న కొనుగోలుదారులకు షాకిచ్చాయి. కానీ మళ్లీ బంగారం పెరగడంతో కొనుగోలుదారులకు నిరాశే ఎదురైంది.

తెలుగు, రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు పలు ప్రాంతాల్లో గురువారం 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 500 పెరిగింది. దీంతో ఇది రూ. 67,100 వద్దుకు చేరింది 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 పెరిగి..73,200 వద్దకు చేరుకుంది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లోనూ ఇవే బంగారం ధరలు ఉన్నాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో గురువారం బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి. 22క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. దీంతో 22క్యారెట్ల బంగారం ధర రూ. 67,250కి చేరింది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 73,350కి చేరుకుంది. ఇదెలా ఉంటే దేశవ్యాప్తంగా వెండి ధరల్లో మాత్రం గురువారం ఎలాంటి కదలిక లేదు. హైదరాబాద్ లో ప్రస్తుతం వెండి కిలో ధర రూ. 92,000దగ్గర స్థిరంగా కొనసాగుతోంది. 

Tags:    

Similar News