Today Gold Rate : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర

Gold Rate Today : బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 300 రూపాయలు తగ్గింది. దీంతో బంగారం ధర మరోసారి 73 వేల రూపాయల దిగువకు చేరుకుంది.

Update: 2024-08-26 01:03 GMT

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు పండగే...తులం బంగారం ఎంతంటే..?

Gold And Silver Rate Today : బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 300 రూపాయలు తగ్గింది. దీంతో బంగారం ధర మరోసారి 73 వేల రూపాయల దిగువకు చేరుకుంది. ప్రస్తుతం బంగారం తాజా ధరల విషయానికి వస్తే పసిడి ధర 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,700 రూపాయలుగా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,670 రూపాయలుగా ఉంది.అంతర్జాతీయంగా చూసినట్లయితే బంగారం ధర ఒక ఔన్స్ 2550 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గత నెల బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దిగుమతి సుంకంపై పన్ను తగ్గించడంతో ఒకటే రోజు బంగారం ధర 4 వేల రూపాయలు తగ్గింది.

కానీ బంగారం ధర అక్కడి నుంచి నెమ్మదిగా రికవరీ అవుతూ ప్రస్తుతం ఒక దశలో 73 వేల ఎగువ వరకు చేరింది. మరోవైపు శ్రావణమాసం కూడా ముగింపు కు వచ్చేసింది మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది అయినాప్పటికీ వివాహాది శుభకార్యాలు ఉన్న నేపథ్యంలో బంగారం ఎక్కువగా కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. అటు అంతర్జాతీయంగా గమనించినట్లయితే బంగారం ధరలు భారీగా పెరగడం వెనక అమెరికాలో నెలకొన్న ఆర్థిక మాంద్యం సూచనలు కూడా ప్రధానంగా చెబుతున్నారు.

దీనికి తోడు సెప్టెంబర్ నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను అరశాతం మేర రెండు దఫాలో తగ్గించే అవకాశం ఉందని వార్తలు కూడా గోల్డ్ సెంటిమెంటును పెంచుతున్నాయి. సాధారణంగా స్టాక్ మార్కెట్లు అదేవిధంగా ప్రపంచ మార్కెట్లో కుదేలు అయినప్పుడు బంగారంపై పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బంగారం అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు పరిగణిస్తూ ఉంటారు అందుకే ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ బంగారం మాత్రం భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.

మీరు బంగారం ప్రస్తుతం వద్ద కొనుగోలు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారా అయితే నిపుణులు మాత్రం బంగారం ధర తగ్గినప్పుడల్లా కొద్ది మొత్తం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పసిడి ధరలు ప్రతి సంవత్సరం సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు వెళుతున్నాయి.

ఈ నేపథ్యంలో బంగారం ధర తగ్గినప్పుడల్లా కొద్ది మొత్తం కొనుగోలు చేసినట్లయితే, మీరు భవిష్యత్తులో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి తోడు బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మీరు తక్కువ ధర వద్ద కొనుగోలు చేసినప్పుడు మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News