SSY: కుమార్తె వివాహం సమయానికి రూ. 46 లక్షలు పొందాలంటే.. నెలకు ఎంత పొదుపు చేయాలి.?

Sukanya Samriddhi Yojana Calculator: పెరిగిన ఖర్చులు, మారుతోన్న ఆర్థిక అవసరాల నేపథ్యంలో చాలా మందిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది.

Update: 2024-07-09 15:30 GMT

SSY: కుమార్తె వివాహం సమయానికి రూ. 46 లక్షలు పొందాలంటే.. నెలకు ఎంత పొదుపు చేయాలి.?

Sukanya Samriddhi Yojana Calculator: పెరిగిన ఖర్చులు, మారుతోన్న ఆర్థిక అవసరాల నేపథ్యంలో చాలా మందిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. ఖర్చు చేసిన తర్వాత పొదుపు చేసే రోజులు పోయాయి. పొదుపు చేసిన తర్వాతే ఖర్చు చేస్తున్నారు. ఇక ఆడ బిడ్డలున్న వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి పెళ్లికి లేదా ఉన్నత విద్య కోసం డబ్బులు పొదుపు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వాలు సైతం అనే రకాల పథకాలను తీసుకొస్తున్నాయి. ఇలాంటి వాటిలో సుకన్య సమృద్ధి యోజన పథకం ఒకటి.

ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రిటర్న్స్‌ పొందొచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టిన పెట్టుబడిపై 8.20 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తున్నారు. ఈ పథకంలో కనిష్టంగా రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఖాతాదారులు డిపాజిట్ చేసిన మొత్తంపై చక్రవడ్డీ వడ్డీ ప్రయోజనం పొందుతారు. అమ్మాయి పుట్టిన నాటి నుంచి ఆమెకు 15 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 21 ఏళ్ల వయసు వచ్చే వరకు పెట్టుబడి డబ్బు లాక్‌ అవుతుంది.

ఉదాహరణకు మీ కుమార్తె 21 ఏళ్ల వయసు వచ్చే నాటికి రూ. 46 లక్షలు రావాలంటే ఎంత పొదుపు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకంలో భాగంగా ఏటా రూ. లక్షల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇలా 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాలి. అనంతరం అమ్మాయికి 21 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు లాక్‌ అవుతాయి. ఈ లెక్కన చూసుకుంటే నెలకు రూ. 10 వేల లోపు పొదుపు చేయాల్సి ఉంటుంది. దీంతో 15 ఏళ్లకు రూ. 15 లక్షలు అవుతుంది. 21 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఆ డబ్బు లాక్‌ అవుతుంది. 21 ఏళ్ల తర్వాత వడ్డీతో కలిపి మొత్తం రూ. 46,18,385 పొందొచ్చు. ఈ లెక్కన వడ్డీనే ఏకంగా రూ. 31 లక్షలు జమ అవుతుంది.

కాగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ఒక ఆర్థిక సంవత్సరంలో, ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత అందుకున్న మొత్తంపై పన్ను ఉండదు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మెచ్యూరిటీకి ముందే కొంత డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత చదువుల కోసం 50 వాతాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

Tags:    

Similar News