Wedding Season: వచ్చేస్తుంది పెళ్లిళ్ల సీజన్.. ఇక వారికి పండగే..!

Wedding Season: దసరా,దీపావళి పండుగలు ముగిసాయి ఇక త్వరలో పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభంకానుంది.

Update: 2022-11-08 12:41 GMT

Wedding Season: వచ్చేస్తుంది పెళ్లిళ్ల సీజన్.. ఇక వారికి పండగే..!

Wedding Season: దసరా,దీపావళి పండుగలు ముగిసాయి ఇక త్వరలో పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభంకానుంది. వ్యాపారులందరు ఇప్పుడు రెండో బొనాంజా కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని రకాలుగా సిద్దమవుతున్నారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు పెళ్లిళ్ల సీజన్ కొనసాగనుంది. రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ (CAIT) నిర్వహించిన సర్వే ప్రకారం ఈ నెలరోజులలో దాదాపు దేశవ్యాప్తంగా 32 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా. ఇందులో దాదాపు రూ.3.75 లక్షల కోట్ల కొనుగోళ్లు, వ్యాపారంలో జరుగుతుందని చెబుతోంది.

50,000 వివాహాలకు కోటి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. మరో 50 వేల పెళ్లిళ్లకు రూ.50 లక్షలు, 5 లక్షల పెళ్లిళ్లకు రూ.25 లక్షలు, పది లక్షల పెళ్లిళ్లకు రూ.10 లక్షల ఖర్చు అవుతుందని అంచనా. గతేడాది ఇదే సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు 25 లక్షల వివాహాలు జరగ్గా రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. అయితే ఈ వివాహ సీజన్ ముగిసాక మళ్లీ తదుపరి 14 జనవరి 2023 నుంచి జూలై 2023 వరకు ప్రారంభమవుతుంది.

ప్రతి వివాహానికి అయ్యే ఖర్చులో 20 శాతం వధూవరులకు, 80 శాతం ఖర్చు ఇతర థర్డ్ ఏజెన్సీలకు వెచ్చిస్తున్నట్లు తేలింది. పెళ్లిళ్ల సీజన్‌కు ముందు, ఇళ్ల మరమ్మతుల కోసం చాలా ఖర్చు చేస్తారు. ఇది కాకుండా నగలు, చీరలు, ఫర్నీచర్, రెడీమేడ్ దుస్తులు, బట్టలు, పాదరక్షలు, పెళ్లి, శుభలేఖలు, డ్రై ఫ్రూట్స్, మిఠాయిలు, పండ్లు, పూజ సామగ్రి, కిరాణా, ఆహార ధాన్యాలు, అలంకరణ వస్తువులు, గృహాలంకరణ వస్తువులు, ఎలక్ట్రిక్ యుటిలిటీ, ఎలక్ట్రానిక్స్, అనేక బహుమతి వస్తువులకి డిమాండ్‌ ఉంటుంది.

బాంకెట్ హాల్స్, హోటళ్లు, ఓపెన్ లాన్‌లు, కమ్యూనిటీ సెంటర్లు, పబ్లిక్ పార్కులు, ఫామ్ హౌస్‌లు, ఇతర రకాల వేదికలు దేశవ్యాప్తంగా వివాహాల కోసం సిద్ధం అవుతాయి. ఉపకరణాల కొనుగోలుతో పాటు, ప్రతి వివాహానికి టెంట్ డెకరేటర్‌లు, ఫ్లవర్ డెకరేటర్‌లు, క్రాకరీ, క్యాటరింగ్ సర్వీస్, ట్రావెల్ సర్వీస్, క్యాబ్ సర్వీస్, రిసెప్షన్ ప్రొఫెషనల్ గ్రూప్‌లు, కూరగాయల విక్రయదారులు, ఫోటోగ్రాఫర్‌లు, వీడియోగ్రాఫర్‌లు, ఆర్కెస్ట్రా వంటి అనేక రకాల సేవలు ఉంటాయి. డీజే, ఊరేగింపు కోసం గుర్రాలు, బండ్లు, లైట్లు, అనేక రకాల సేవలు అవసరమవుతాయి. వీరందరికి పెద్ద వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఈవెంట్ మేనేజ్‌మెంట్ వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి.

Tags:    

Similar News