Portable AC: మాడు పగిలే ఎండల్లో చల్లని వార్త.. క్షణాల్లో ఇంటిని చల్లబరిచే 3 పోర్టబుల్ ఏసీలు.. రూ.10వేలలోపే..!
Portable AC: చాలా తక్కువ ఖర్చుతో మన ఇంటికి తెచ్చుకోవచ్చు. వీటితో ఇంటినంతా చల్లగా మార్చుకోవచ్చు. సైజులోనూ చిన్నగా, ఎక్కడికైనా తీసుకెళ్లంగా తేలికగా ఉంటాయి. ముఖ్యంగా దీనితో విద్యుత్ బిల్లు కూడా భారీగా ఆదా అవుతుంది.
Portable AC: మాడు పగిలే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓ వెపు వేడి, మరోవైపు ఉక్కపోత నుంచి బయటపడేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇవి చాలా ఖరీదుగా ఉంటాయి. అలాగే కరెంట్ బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ప్రజలకు అందుబాటులో ప్రస్తుతం ఎన్నో ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ముఖ్యంగా పోర్టబుల్ ఏసీలు జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మినీ ఏసీల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో మన ఇంటికి తెచ్చుకోవచ్చు. వీటితో ఇంటినంతా చల్లగా మార్చుకోవచ్చు. సైజులోనూ చిన్నగా, ఎక్కడికైనా తీసుకెళ్లంగా తేలికగా ఉంటాయి. ముఖ్యంగా దీనితో విద్యుత్ బిల్లు కూడా భారీగా ఆదా అవుతుంది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మినీ ఏసీలను ఓసారి పరిశీలిద్దాం..
CEROBEAR రీచార్జబుల్ మినీ ఏసీ: CEROBEAR రీచార్జబుల్ పోర్టబుల్ ఏసీలో మూడు స్పీడ్ కంట్రోల్స్ ఉన్నాయి. దీంతో మీకు అనుకూలమైన వేగానని సెట్ చేసుకోవచ్చు. ఈ మినీ ఏసీలో 4000 mAh బ్యాటరీ అందించారు. CEROBEAR రీచార్జబుల్ పోర్టబుల్ ఏసీ రూ. 10 వేలకే ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉంది.
షాలెక్ మినీ ఏసీ: షాలెక్ మినీ ఏసీ చాలా తేలికగా ఉంటుంది. 4000 mAh బ్యాటరీతో ఎక్కువ సేపు ఇంటిని చల్లగా చేసుకోవచ్చు. కరెంట్‌తో పనిలేకుండా కేవలం ఛార్జింగ్ పెట్టుకుని దీనిని వాడుకోవచ్చు. షాలెక్ మినీ ఏసీ కేవలం రూ. 9 వేలకే ఇంటికి తీసుకెళ్లొచ్చు.
LaoTzi రీచార్జబుల్ మినీ ఏసీ: LaoTzi రీచార్జబుల్ మినీ ఏసీలో కూడా 3 స్పీడ్ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే ఇందులో అమర్చిన ఎల్‌ఈడీ లైట్లు 7 రంగులలో మెరుస్తూ.. రాత్రి పూట లైట్‌గానూ వాడుకోవచ్చు. యూఎస్‌బీ ఛార్జింగ్ సౌకర్యంతో దీనిని ఛార్జ్ చేసుకోవచ్చు. LaoTzi రీచార్జబుల్ మినీ ఏసీ ధర రూ. 10 వేలులోపు అందుబాటులో ఉంది.