Indian Railway: రైల్వే ప్రయాణికులకి గమనిక.. వీటి ధరలు ఎప్పుడైనా పరిశీలించారా..!

Indian Railway: చాలామందికి రైల్వేలో ప్రయాణించేటప్పుడు ఆహార, పానీయాల ధరలు తెలియకుండా ఉంటాయి.

Update: 2022-07-05 08:57 GMT

Indian Railway: రైల్వే ప్రయాణికులకి గమనిక.. వీటి ధరలు ఎప్పుడైనా పరిశీలించారా..!

Indian Railway: చాలామందికి రైల్వేలో ప్రయాణించేటప్పుడు ఆహార, పానీయాల ధరలు తెలియకుండా ఉంటాయి. దీంతో అసలు ధరలు తెలుసుకొని ఒక్కోసారి షాక్‌ అవుతూ ఉంటారు. ఇటీవల శతాబ్ది రైలులో టీ బిల్లుతో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఫోటోను షేర్ చేస్తూ సదరు వ్యక్తి రూ.20 టీపై రూ.50 జీఎస్టీ వసూలు చేశారని పేర్కొన్నాడు. అయితే రైల్వే టీపై రూ.50 పన్ను విధించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట్లో ఐఆర్‌సీటీసీపై విమర్శలు చేస్తున్నారు. అయితే రైల్వే అధికారులు దీనిపై సమాధానం ఇస్తూ ప్రయాణీకుల నుంచి అదనపు డబ్బులు తీసుకోలేదని తెలిపారు.

వాస్తవానికి రైల్వే అధికారి ప్రకారం రాజధాని లేదా శతాబ్ది వంటి రైళ్లలో వెళ్లే ప్రయాణికులు భోజనం బుక్ చేసుకున్నట్లయితే అతని నుంచి ఎటువంటి సేవా పన్ను వసూలు చేయరు. రిజర్వేషన్ చేసేటప్పుడు ప్రయాణీకుడు ఆహారం బుక్ చేసుకోకపోతే అతను రూ. 50 సర్వీస్ ఛార్జీ చెల్లించాలని 2018లో రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు రైళ్లలో ఆహార, పానీయాల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

1. బ్రేక్ ఫాస్ట్ వెజిటేరియన్- 40

2. బ్రేక్ ఫాస్ట్ నాన్ వెజిటేరియన్- 50

3. స్టాండర్డ్ మీల్ వెజిటేరియన్- 80

4. స్టాండర్డ్ మీల్ నాన్ వెజిటేరియన్ (గుడ్డు)- 90

5. స్టాండర్డ్ మీల్ నాన్ వెజిటేరియన్ (చికెన్‌)- 130

6. వెజిటేరియన్ బిర్యానీ (350గ్రా)- 80

7. ఎగ్ బిర్యానీ (350గ్రా)- 80

రాజధాని/శతాబ్ది/దురంతోలో ఈ విధంగా ఉంటాయి..

1. ఉదయం టీ - 35

2. అల్పాహారం -140

3. లంచ్/డిన్నర్ - 245

చైర్ కార్, AC 3, AC 2

1. ఉదయం టీ - 20

2. అల్పాహారం -120

3. లంచ్/డిన్నర్ - 185

4. సాయంత్రం టీ - 90

స్లీపర్ క్లాస్

1. ఉదయం టీ- 15

2. అల్పాహారం-65

3. లంచ్/డిన్నర్- 120

4. సాయంత్రం టీ- 50

Tags:    

Similar News