Business Idea: రైతులకి అలర్ట్‌.. ఈ వ్యాపారం చేస్తే పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ..!

Business Idea: వాణిజ్య పంటలు వేసి నష్టపోయిన రైతులకి ఇదొక ప్రత్యామ్నాయ వనరుగా చెప్పవచ్చు. దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదు.

Update: 2023-08-04 14:30 GMT

Business Idea: రైతులకి అలర్ట్‌.. ఈ వ్యాపారం చేస్తే పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ..!

Business Idea: వాణిజ్య పంటలు వేసి నష్టపోయిన రైతులకి ఇదొక ప్రత్యామ్నాయ వనరుగా చెప్పవచ్చు. దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఈ వ్యాపారం వల్ల మంచి ఆదాయం సమకూరుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు డిమాండ్ ఉంటుంది. పెట్టుబడి పెద్దగా అవసరం ఉండదు కానీ కచ్చితంగా వ్యవసాయ భూమి ఉండాలి. ఎందుకంటే మనం చేసేపని కూరగాయలు పండించడమే. ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది ఇప్పుడు వ్యవసాయం వైపు మెుగ్గుచూపుతున్నారు. అలాంటి ఆర్గానిక్‌ కూరగాయలు పండిస్తే బాగా సంపాదించవచ్చు. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం.

తక్కువ పెట్టుబడితో రసాయనాలు వినియోగించకుండా పండించే కూరగాయలు, ఆకుకూరలు వంటి ఆర్గానిక్ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. మారుతున్న ప్రజల జీవనశైలితో పాటు మంచి ఆహార అలవాట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదే ఇప్పుడు యువ రైతులకు మంచి ఆదాయ మార్గంగా మారుతోంది. రూ.20 వేలు పెట్టుబడితో కూరగాయల సాగును ప్రారంభిస్తే నెలకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. సహజసిద్ధమైన ఎరువుల వినియోగం రైతులకు ఖర్చులను తగ్గించటంతో పాటు దిగుబడిని పెంచుతుంది.

పైగా ఇలా పండించే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. రైతులు వీటిని సమీపంలోని మార్కెట్లలో స్టాల్ ఏర్పాటు చేసుకుని కూడా విక్రయించవచ్చు. లేదంటే ఆన్ లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకుని వినియోగదారులకు డెలివరీ చేయవచ్చు. అంతేకాకుండా సమీపంలోని సూపర్ మార్కెట్లు, మాల్స్ వంటి చోట్ల ఉండే స్టోర్లతో అగ్రిమెంట్ కుదుర్చుకుని ఉత్పత్తులను సరఫరా చేయవచ్చు. ఇలా చేయటం వల్ల ఎక్కువ మంది కస్టమర్లకు ఉత్పత్తులను విక్రయిస్తూ తక్కువ సమయంలో మంచి ఆదాయం సంపాదించవచ్చు.

Tags:    

Similar News