EPF Withdraw: పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ముందు ఈ కీలక విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

EPF Withdraw: అత్యవసర సమయంలో మధ్య మధ్యలో విత్ డ్రా చేస్తుంటారు. అలాంటి వారు ముందుగా ఈ కీలక విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఆ కీలక విషయాలేంటో ఓసారి చూద్దాం.

Update: 2024-10-08 05:52 GMT

 EPF Withdraw: పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ముందు ఈ కీలక విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

 EPF Withdraw: భారత ప్రభుత్వం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమును అమలు చేస్తోంది. ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, వ్రుద్ధాప్యంలో సురక్షితమైన జీవితం అందించాలన్న ఉద్దేశ్యంతో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ స్కీమును నిర్వహిస్తోంది. దేశంలోని ప్రతి ఉద్యోగి ఇందులో మెంబర్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది.

ఈపీఎఫ్ఓ సంస్థ ప్రతిమెంబర్ కు యూనివర్సల్ అకౌంట్ నంబర్ కేటాయిస్తుంది. ఈ అకౌంట్ లోనే పీఎఫ్ డబ్బులు జమ అవుతుంటాయి. అయితే కొన్ని అవసరాల కోసం మధ్యలో పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తుంటారు. ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ అయిన ఆ డబ్బును విత్ డ్రా చేసుకోవడంలో ఉమాంగ్ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది.

ఈపీఎఫ్ఓ సేవలను యాక్సెస్ చేసేందుకు ఉమాంగ్ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ ఉపయోగించి వారి మొబైల్ ఫోన్స్ నుంచి నేరుగా వారి పీఎఫ్ ఖాతాలను పర్యవేక్షించవచ్చు. పీఎఫ్ ఉపసంహరణ అభ్యర్థన, దాని స్టేటస్ ట్రాక్ చేయడానికి ఉమాంగ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఉమాంగ్ యాప్ ను ఉపయోగించి పీఎఫ్ డబ్బును ఎలా విత్ డ్రా చేసుకోవాలో చూద్దాం.

మీ ఫోన్ లో ఉమాంగ్ యాప్ తెరిచిన తర్వాత, మీ వివరాలతో లాగిన్ చేసి సర్వీస్ విభాగంలో ఈపీఎఫ్ఓ ఎంపికను ఎంచుకోండి. ఎంప్లాయి సెంట్రిక్ సర్వీసెస్ విభాగానికి వెళ్లి, రైజ్ క్లెయిమ్ క్లిక్ చేయండి. అక్కడ యూఎన్ నెంబర్ నమోదు చేయాలి. అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి తర్వాత విత్ డ్రా చేయాలనుకుంటున్న మొత్తం మీ బ్యాంక్ అకౌంట్ సమాచారంతో సహా అవసరమైన వివరాలను ఇవ్వండి. మీరు ప్రాసెస్ ను పూర్తి చేసిన తర్వాత మీరు రిఫరెన్స్ నెంబర్ పొందుతారు. ఉమాంగ్ యాప్ తో మీరు మీ పీఎఫ్ డబ్బును ఎప్పుడైనా, ఎక్కడైనా విత్ డ్రా చేసుకోవచ్చు.

ఉమాంగ్ యాప్ లో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి. మీ ఫోన్లో యాప్ ను తెరచి ఈపీఎఫ్ఓ ఎంపికను ఎంచుకోండి. తర్వాత ఎంప్లాయి సెంట్రిక్ సర్వీసెస్ విభాగానికి వెళ్లి పాస్ బుక్ వీక్షించండి ఎంచుకోండి. మీ యూఏఎన్ నెంబర్ నమోదు చేయండి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీని అందుకుంటారు. ఆ ఓటీపీని నమోదు చేసిన తర్వాత మీ బ్యాలెన్స్ వివరాలు స్క్రీన్ ప్లే కనిపిస్తాయి.


Tags:    

Similar News